ఆడుదాం ఆంధ్రా పేరుతో దోచేసిన డబ్బుల గురించి విజిలెన్స్ పూర్తి స్థాయిలో ఆరా తీసింది. అన్నిజిల్లాల్లో విచారణ నిర్వహించింది. ఎక్కడెక్కడ ఎలా దోచాలో వివరాల లెక్కలు తీసింది. విచారణ నివేదికను డీజీపీకి సోమవారం విజిలెన్స్ సమర్పించనుంది. శాప్ చైర్మన్ రవి నాయుడు. .. ఆడుదాం ఆంధ్రా పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేశారని ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ దర్యాప్తు చేసింది. అన్ని వివరాలతో నివేదికను సిద్ధం చేసింది.
ఆడుదాం ఆంధ్రాను ఫక్తు రాజకీయ ప్రమోషన్ కోసం వాడుకున్నారు. వైసీపీ కార్యకర్తలను ఆటగాళ్ల పేరుతో తీసుకు వచ్చి వారికి డబ్బులు ఇచ్చారు. గెలవకపోయినా ఆడకపోయినా గెలిచినట్లుగా రివార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం మంత్రి రోజా, నాడు శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనుసన్నల్లో జరిగింది. కనీసం రూ. 120 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
సామాగ్రి కొనుగోలు చేసిన దాని కన్నా ఎక్కువగా బిల్లులు పెట్టుకోవడం, నాసిరకం సామాగ్రి కొనుగోలు చేయడం సహా .. దొరికిన ప్రతీ దాంట్లోనూ దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ విజిలెన్స్ విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సోమవారం డీజీపీ చేతికి విచారణ నివేదిక వస్తుంది. ఆ తర్వాత చర్యలు ప్రారంభించనున్నారు.