పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీల్లో ఓటమి ఖాయమని జగన్ తమ పార్టీ నేతలకు ముందస్తు సందేశం ఇచ్చారు. ప్రచార గడువు ముగియగానే ఏడుపందుకుంటూ ఓ ట్వీట్ చేశారు. అది కూడా ఓ చాటభారతమంత ఉంది. పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని.. వంద మంది వైసీపీ కార్యకర్తల్ని బైండోవర్ చేశారన్నారు. వైసీపీ నేతలపై అదే పనిగా దాడులు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిపై దాడులు చేశారని .. ఎమ్మెల్సీకి గాయాలయ్యాయన్నారు.
టీడీపీ నేతలపై కేసులు పెట్టలేదని, అరెస్టులు చేయలేదని.. పోలింగ్ రోజున వైసీపీ నాయకులు , కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీలో చేరిన వారిని భయపెట్టి పార్టీలో చేర్చుకున్నారని … అతనివద్దనుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చారన్నారు. వైసీపీ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రాకుండా.. దూరంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారన్నారు. రెండు, మూడు కిలోమీటర్ల దూరం అని.. జగన్ ఓ లిస్టు కూడా జత చేశారు.
జగన్ రెడ్డి చెప్పిన మాటలు చూస్తే.. గతంలో ఎంతో అనుభవంతో చేసినట్లుగా ఎలా జరుగుతుందో చెప్పుకొచ్చారు. అవన్నీ గతంలో వాళ్లు చేశారేమో కానీ.. ఇప్పుడు ఇలా మాట్లాడటం మాత్రం ఆయన బేల తనాన్ని చూపిస్తోంది. సాక్షికి చెందిన వారిని వందల మందిని మోహరించి ప్రచారం చేసుకున్నారు. టీడీపీ నేతలు ఎక్కడైనా తప్పు చేస్తే.. వెంటనే రికార్డు చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా ఆరోపణలు చేస్తున్నారు.
ఇంత కాలం పులివెందులలో జరిగింది రిగ్గింగే. ఇప్పుడు ప్రజలు అసలు ఓట్లు వేయబోతున్నారు. అందుకే జగన్ కంగారు పడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.