ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి ఇండీ కూటమి పార్టీలు మద్దతిస్తున్నాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. కానీ అటు బీజేపీని వ్యతిరేకించలేని…. ఇటు కాంగ్రెస్ కు దగ్గర కాలేని బీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీల పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. కేటీఆర్ కాస్త ధైర్యం చేసి.. రాహుల్ పైనే విమర్శలు చేస్ున్నారు. ఓట్ల చేరీ చేసింది మీరేనని అంటూ ట్వీట్ పెట్టారు.
తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 వాగ్దానాలు చేయడం, స్టాంప్ పేపర్లపై 6 హామీలను పవిత్రమైనవిగా చూపించడం, తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారన్నారు. 100 రోజుల్లోపు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఓట్లు , సీట్లు సాధించిన తర్వాత, అదే విషయాన్ని అమలు చేసే విషయానికి వస్తే కనిపించకుండా పోయారన్నారు. దీన్ని ఓట్ల చోరీ అని ఎందుకనకూడదని కేటీఆర్ ప్రశ్న.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలపై నమ్మకం కేటీఆర్ కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తమ వాదనలకు తగ్గట్లుగా ఉన్న రాహుల్ పోరాటానికి మద్దతు ప్రకటించాలి కానీ సంబంధం లేని తెలంగాణ రాజకీయ అంశాలను తెరపైకి తీసుకు వచ్చి రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగడం మాత్రం కాస్త విచిత్రంగా ఉంది. ఏ విషయంలో అయినా బీజేపీని పల్లెత్తు మాట అనకుండా.. ఢిల్లీలో ఉండి కూడా.. కాంగ్రెస్ పైనే విమర్శలు చేయడం.. బీజేపీతో సంబంధాల కోసం కేటీఆర్ చేస్తున్న పోరాటం అని అనుకోవాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు