తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా హైదరాబాద్ ను విస్తరిస్తోంది. ఐటీ రంగాల్లో చిన్న చిన్న కంపెనీలు అయినా శివారు నగరాల్లో కార్యాలయాలు తెరిచేలా ప్రోత్సహిస్తోంది. ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఇలా ఇతర పట్టణాల్లో ఐటీ ఆఫీసులు పెట్టాలనుకునేవారికి మద్దతుగా ఉంటున్నారు.
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి చోట్ల ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వరంగల్ లో సైయెంట్ , టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఆఫీసులు ప్రారంభించాయి. వరంగల్‌లో ఐటీ హబ్‌లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కరీంనగర్లో నూ ఐటీ టవర్ ఉంది. నిజామాబాద్ ఐటీ టవర్‌లో 15 స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఖమ్మం ఐటీ హబ్‌లో చిన్న-మధ్య తరహా కంపెనీలు ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ ఐటీ టవర్‌లో 9 కంపెనీలు 2023లో ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్‌లో ఎన్టీటీ డేటా కార్యాలయం ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. అదిలాబాద్‌లో కొత్త ఐటీ టవర్ పూర్తయింది.
ఉపాధి అవకాశాలు విస్తృతం అయితే హైదరాబాద్ మీద భారం తగ్గుతుంది. అదే సమయంలో ఆయా నగరాల్లో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఐటీ ఆఫీసుల్లో అత్యధిక మంది ఉద్యోగులు ఉన్న చోట్ల శాటిలైట్ ఆఫీసులు పెట్టడం అనే కాన్సెప్ట్ ను దిగ్గర ఐటీ కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కొన్ని చోట్ల ఐటీ ఆఫీసుల ఏర్పాటు జరిగే అవకాశాలు ఉన్నాయి.