అంబటి రాంబాబు తన కంటే తెలివైన వాళ్లు లేరని అనుకుంటారేమో కానీ.. ఆయన సోషల్ మీడియాలో చూపించే తెలివితేటలు చూసి ఎవరైనా.. అబ్బురపడకుండా ఉండరు. తాజాగా ఆయన ఓ వీడియో పోస్టు చేసి.. కోయ ప్రవీణ్‌కు అంకితం అని పోస్టు చేశారు. అది ఓ వ్యక్తి అదే పనిగా ఓట్లు వేస్తున్న వీడియో.
నిజానికి ఆ వీడియో చూస్తే.. అది పులివెందుల స్కూళ్లలో కాదని.. ఉత్తరాదిలో ఎక్కడిదో అని చూస్తేనే తెలిసిపోతుంది. ఆ వీడియోలో ఉన్న వారి డ్రెస్సులు చూసినా అర్థమైపోతుంది. కానీ అంబటి రాంబాబు దాన్ని పులివెందులలో జరిగిందని నమ్మించాలనుకున్నారు.
కానీ వెంటనే నెటిజన్లు గుర్తు పట్టారు. ఆ వీడియో ఎక్కడితో బయట పెట్టారు. అది 2023 జులైలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల వీడియో. దీన్ని అప్పట్లోనే సుధాంశు వేది అనే వ్యక్తి పోస్ట్ చేసారు. దాన్ని డౌన్ లోడు చేసుకుని అంబటి రాంబాబు పోస్టు చేసి ఫేక్ చేద్దామనుకున్నారు. కానీ దొరికిపోయారు.
ఈ వీడియో పెట్టి డీఐజీపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ మండిపడింది. ఇటువంటి ఫేక్ ప్రచారం చేసే వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలకు అవకాశం ఉందో.. అలాంటి చర్యలకు అంబటి రాంబాబు మీద తీసుకుంటామని ప్రకటించారు. ఆయనపై కేసులు పెట్టే అవకాశం ఉంది. తెలివితేటలు పోలీసులకూ ఉంటాయని ఆయనకు తెలిసేలా చేస్తారేమో ?