అలస్కా చర్చలు బాగా జరిగాయి. మరోసారి సమావేశం ఉంటుంది అని ట్రంప్ ప్రకటిస్తున్న సమయంలో పుతిన్ కలగచేసుకుని.. మాస్కోలో అని కూడా యాడ్ చేశారు. అంటే నెక్ట్స్ ట్రంప్ .. మాస్కోకు వెళ్లి చర్చల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
పుతిన్ అలస్కాకు వచ్చినప్పుడు ట్రంప్ మాస్కోకు వెళ్తాడు..అందులో ఏముందని అనుకోవచ్చు. కానీ ట్రంప్ చేసిన పిచ్చి పనుల వల్ల ఇప్పుడు ట్రంప్ అంతకంతకూ గడ్డుపరిస్థితిని ఎదుర్కోవాల్సిన ఉంటుంది. అలస్కాలో ట్రంప్ తన సైనిక సామర్థ్యాన్ని చూపించారు. యుద్ధ విమానాలను పుతిన్ ఎదుట పెట్టారు. అసలు అలస్కాలో అలాయుద్ధ విమానాల్ని మోహరించాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. పుతిన్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన తలపై బీ2 యుద్ధ విమానాలు ఎగిరేలా ప్లాన్ చేశారు. చివరికి పుతిన్‌కు ఏదో తేడా కొట్టింది. అందుకే.. ఆయనతో కారులో కాకుండా ట్రంప్ కారులోనే.. ట్రంప్ తో పాటే సమావేశ ప్రాంగణానికి వెళ్లారు.
అమెరికా ఆయుధాల్ని ట్రంప్ షో చేశారు. మరి పుతిన్ మాత్రం ఊరుకుంటారా ?. ఆవేశపడకుండా.. ఇలాంటి ఈగో వ్యవహారాల్ని డీల్ చేయడంలో పుతిన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తనతో సమావేశానికి వచ్చే వారికి క్రెమ్లిన్‌లో దడ పుట్టించే ఘటనలు చాలా చూపించారు. ఇప్పుడు ట్రంప్ చేసిన దానికి రెట్టింపు పుతిన్ చేయాలని అనుకుంటారు. ఆయనలాగా ఆయుధాల బలప్రదర్శన చేస్తారా..లేకపోతే ట్రంప్ ను భయపెట్టేది ఏదో తెలుసకుని అలా ప్లాన్ చేస్తారా అన్నది తర్వాత ట్రంప్ టూర్ లోనే తెలుస్తుంది.
ట్రంప్ లాంటి ఈగో అధ్యక్షుల వల్లనే ప్రపంచంలో కొత్త కొత్త సమస్యలు వస్తూంటాయి. అమెరికాబలాన్ని, సైనిక శక్తిని రష్యా అధ్యక్షుడికి చూపించి భయపెట్టాలని అనుకోవడంతోనే ట్రంపరితనం ఉంది. ఇలాంటి వాటి వల్ల అమెరికాకు జరిగే లాభం ఏమీ ఉండదు.