ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించగానే వైసీపీ వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. కొంత మంది పెయిన్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. అయితే అసలు పీడ్ బ్యాక్ ఏమిటో తెలుసుకోకుండా.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారం చేయడం వల్ల .. వైసీపీకి భారీ నష్టమే జరుగుతుంది కానీ లాభం కాదు. ఎందుకంటే ఉచిత బస్సు స్కీం మహిళలు అందరికీ వర్తిస్తుంది. వారికి తెలుసు.. ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో. ఇది ప్రజల్లో సానుకూల భావన తెచ్చే స్కీమ్. అందుకే కంగారు పడి.. తప్పు తప్పుగా .. ఫేక్ ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.
కానీ ఇంత తొందరపాటు ఎందుకో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. ఓ వారం పది రోజులు ఆగితే.. ఈ పథకం అమల్లో ఉన్న సమస్యలేమిటో బయటపడతాయి. అప్పుడు వాటిని ప్రశ్నించవచ్చు. కానీ పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని చేసే తప్పుడు ప్రచారం వల్ల మహిళలకు కోపం వస్తుంది. దాని వల్ల వైసీపీకే నష్టం జరుగుతుంది. స్త్రీ శక్తి పథకంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. నిజానికి పథకం ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున రష్ ఉంటుందని.. అనుకున్నారు. కానీ ప్రభుత్వం తగినన్ని బస్సులు ఏర్పాటు చేసింది. అందుకే.. బస్సుల్లో ఎక్కడా పెద్దగా ఇబ్బందులు ఎదురు కావడం లేదు.
ఈ పథకంలో మహిళ ఒక్క సారి బస్సు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా .. అది పార్టీ వారైనా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పుకుంటారు. బస్సుల్లో ప్రయాణించేది అత్యధికంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లే. వాళ్లకు చార్జీలు మిగిలితే.. ఎంత ఆదా అవుతుందో స్పష్టత ఉంది. అందుకే ఈ పథకంపై మహిళలలో ఆసక్తి ఉంది. ఆ విషయం ఆర్థం చేసుకోకుండా వేస్ట్ అన్నట్లుగా ప్రచారం చేస్తే.. అది వైసీపీకే నష్టం జరుగుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
వైసీపీ గుడ్డిగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని తొందర పడుతోంది కానీ… ఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదు. ఐ ప్యాక్ ఉందో లేదో కానీ.. వైసీపీ రాజకీయం మాత్రం గుడ్డెద్దు చేలో పడినట్లుగా జరిగిపోతోంది.