జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయనకు సంబంధించినవి అంటూ కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరుతో కొంత మంది రచ్చ ప్రారంభించారు. అనంతపురంలోని ఎమ్మెల్యే ఆఫీసును కొంత మంది ముట్టడించారు.
ధనుంజయ్ అనే ఎన్టీఆర్ అభిమాని ఫోన్ చేసినప్పుడు ఎమ్మెల్యే ఇలా అనుచితంగా మాట్లాడారని.. ఆ మాట్లని ఆ ధనుంజయ్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాలన్న ప్రచారం జరుగుతోంది.అయితే ఆ ఆడియోలు తనవి కావని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవన్నీ భోగస్ తనపై కుట్ర జరుగుతోందని.. ఎస్పీకి కూడా ఈ అంశంపై ఫిర్యాదు. చేశామన్నారు. అయినా తన పేరు ప్రస్తావించారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానిక అభిమానని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తొలి సారి గెలిచారు. చివరి క్షణంలో ఆయనకు అనూహ్యంగా టిక్కెట్ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో ఆయనపై వరుసగా వివాదాలు వస్తున్నాయి. ఆడియో కాల్స్ పేరుతో వివాదాస్పదమైన విషయాలపై ఆయన మాట్లాడుతున్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయనపై మరో టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆరోపణు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆడియో టేపుల వివాదం రచ్చకెక్కింది.