ఓ. రాజకీయ సభ పెట్టాలంటే రాజకీయ పార్టీ పది రోజుల సమయం తీసుకుంటుంది. స్టేజ్ ఏర్పాటుతో పాటు జన సమీకరణ కోసం ఈ సమయం తీసుకుంటారు. అయితే వైసీపీ మాత్రం జగన్ రెడ్డి ఎవరికైనా పరామర్శించడానికి వెళ్లాలన్నా సరే పది రోజుల సమయం తీసుకుంటుంది. దానికి తగ్గట్లుగానే షెడ్యూల్ ఖరారు చేస్తారు.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయి జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని జగన్ పట్టించుకోవడంలేదేంటి అన్న చర్చలు జరుగుతున్నాయి. అసలు లిక్కర్ స్కామ్ నిందితులు ఎవర్నీ పరామర్శించలేదు. తన వద్ద పని చేసి జైలుకెళ్లిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను కూడా పరామర్శించలేదు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. వీటిని కవర్ చేసుకునేందుకు కనీసం మిథున్‌రెడ్డిని అయినా పరామర్శించాలని అనుకుంటున్నారు. అందుకని పది రోజుల తర్వాత 25వ తేదీని ఖరారు చేసుకున్నారు.
పది రోజుల గ్యాప్ ఎందుకంటే.. జన సమీకరణకు..రాజమండ్రి వచ్చినప్పుడు స్కిట్స్ వేసే వాళ్లను రెడీ చేయడానికి. జగన్ రెడ్డికి ఇప్పుడు పెళ్లికిపోయినా జన సమీకరణ చేయాల్సి వస్తోంది. ఇక పరామర్శ యాత్రకు అయితే సైలెంట్‌గా వెళ్తారా?. జనం లేకపోతే..తనను ప్రజలు పట్టించుకోవడం మానేశారని అనుకుంటారని.. ఇలా ఎప్పటికప్పుడు జన సమీకరణ చేసుకుంటున్నారు.