మెట్రో సిటీల్లో మాల్స్ కు ఉండే ఆకర్షణ గురించి చెప్పాల్సిన పని లేదు. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మాల్స్ షాపింగ్ స్టైల్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే జీఎమ్మార్.. హైదరాబాద్‌లోని ఎయిరోసిటీలో ఒక హై-స్ట్రీట్ రిటైల్ డెస్టినేషన్ ను నిర్మిస్తోంది. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 6,00,000 చదరపు అడుగుల గ్రాస్ లీజబుల్ ఏరియా (GLA)తో, 100+ ప్రీమియం రిటైల్ యూనిట్లు , PVR INOX మల్టీప్లెక్స్‌తో, ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో షాపింగ్, డైనింగ్, వినోద అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు రెడీ అయింది. .
అంతర్జాతీయ స్థాయి హై-స్ట్రీట్ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో 17 యాంకర్ స్టోర్లు, సినిమా , ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఆల్ఫ్రెస్కో డైనింగ్, మల్టీ-క్యూసిన్ ఫుడ్ కోర్ట్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ సమీపంలో సులువుగా చేరుకునేలా అత్యంత సౌలభ్యమైన రిటైల్ హబ్‌గా రూపొందుతోంది. , ఈ మాల్ ను వచ్చే ఏడాది మొదట్లోనే ప్రారంభించనున్నారు. ఇది హైదరాబాద్‌లో ఒక ప్రముఖ లైఫ్‌స్టైల్ డెస్టినేషన్‌గా మారే అవకాశం ఉంది.[
GMR ఎయిరోసిటీ హైదరాబాద్, 1,500 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్, కమర్షియల్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ జోన్లతో కూడిన సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. GMR ఇంటర్చేంజ్ ఈ విస్తృత విజన్‌లో ఒక ముఖ్య భాగం. శంషాబాద్ ప్రాంతం ఇప్పటికే ఆర్థికంగా ఎదుగుతోంది. జీఎంఆర్ చేపట్టే ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులతో మరో ఆర్థిక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.