వెంకట్రామిరెడ్డి అనే ఉద్యోగ సంఘం నాయకుడు.. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ చివరికి. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి మరీ ఎన్నికల ప్రచారంలో ఓ రాజకీయ పార్టీ కోసం పని చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. దర్యాప్తు చేయించారు. అన్నీ రెడీ అయ్యాయి. ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తారని అనుకుంటున్నా.. ఎవరూ ఆయన జోలికి వెళ్లడం లేదు. సస్పెన్షన్ లో ఉన్నా ఆయన మాత్రం చెలరేగిపోతున్నారు.
ఉద్యోగ సంఘం నేతగా ఉన్న ఆయనను తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాను వైగొలిగేది లేదని కూర్చున్నారు. తప్పు చేసిన ఆయన పదవిలో ఉన్నందున రూల్స్ ప్రకారం.. సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ విషయంలోనూ ముందుకు పోలేకపోయారు. ఇప్పుడు ఆయన సంఘానికి డబ్బులు కూడా ఇస్తూ జీవో రెడీ చేశారు.
ఉద్యోగులకు ఆటలు నిర్వహిస్తామని ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్ గా వెంకట్రామిరెడ్డి ప్రతిపాదన పెడితే రూ. 13 లక్షలు మంజూరు చేసేందుకు సిద్ధమయ్యారు. మంజూరు చేసేశారమో కానీ ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వెంకట్రామిరెడ్డి గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి డబ్బులు పిండుకున్నారు. ఆయన పదవి కాలం మరో రెండు, మూడు నెలల్లో ముగిసిపోతుంది. ఇప్పుడు హడావుడిగా ఆయన అడిగారని డబ్బులు మంజూరు చేయడం ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి.