చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని.. అధికార పార్టీలో ఉండి బాధ్యతారాహితంగా వ్యవహరిస్తే ఎలా అని చంద్రబాబు ప్రశఅనించారు. కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పార్టీ లైన్ దాటిపోతే.. పార్టీకి నష్టం జరిగేలా ఉంటే.. ఎవరినైనా వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై చేసన దాడి వివాదాస్పదమయింది. ఆయన మద్యం మత్తులో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. అటవీ శాఖ ఆయనదే కావడంతో.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డితో పాటు మరో జనసేన పార్టీ నేత కూడా ఆ దాడిలో ఉండటంతో ఆయనపైనా కేసులు నమోదు చేశారు.
ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యేతో పాటు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవి కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. అలాగే ఇద్దరు నెల్లూరు ఎమ్మెల్యేలు రౌడీషీటర్ కు పెరోల్ ఇప్పించడానికి సిఫారసు చేసినట్లుగా గుర్తించారు. ఇలా మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు తీవ్రమైన తప్పిదాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. వీరందరికి చంద్రబాబు గట్టి హెచ్చరికలు పంపించారు. అయితే ఇలా హెచ్చరికలతోనే సరి పెడితే.. ఎవరూ లెక్క చేయరన్న అభిప్రాయం వినిపిస్తోంది.