మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతోనే అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో అభిమానులు ఏర్పడ్డారు. అ..ఆ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనుపమ.. ఇక అక్కడి నుంచి క్లాస్ రోల్స్ కే పరిమితమౌతూ వచ్చింది. ఫ్యాన్స్ ని కూడా ఆమెని అదే తరహ పాత్రల్లో చూడటం అలవాటు చేసుకున్నారు.
డిజే టిల్లు 2 లో గ్లామర్ రోల్ లో ప్రత్నించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది కానీ చాలా మంది అనుపమని ట్రోల్ చేశారు. ఇప్పుడు పరదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అనుపమ. ఈ సందర్భంగా తన నట జీవితం, పాత్రల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
నాకు మంచి పాత్రలు చేయాలని వుంటుంది. కానీ మంచి అనుకున్న సినిమాలని హిట్ చేయరు. డిజే టిల్లు చేశాను. అందులో నా గ్లామర్ మీద కామెంట్ చేశారే కానీ పెర్ఫార్మెన్స్ ని చూడలేదు. ఇప్పుడు పరదా అనే మంచి సినిమానే. ఇది ఎమౌతుందో తెలీదు. అందుకే ఇకపై ఎలాంటి పాత్రలు చేయాలనేది అలోచించడం మానేశాను. గ్లామర్ చేస్తానా? డీగ్లామర్ చేస్తానా? అనే ఐడియా లేదని చెప్పిన అనుపమ.. నవ్వుతూనే ”యాక్టింగ్ మానేస్తానేమో’ అనే మరో బెదిరింపు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.
పరదా పై చాలా నమ్మకంగా వుంది అనుపమ. పరదా ఒక బోల్డ్ ప్రయత్నమని, ఈ పురుషాధిక్య సమాజంలో ఇలాంటి కథని ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ సినిమా చూసినప్పుడు ఒక్కసారి ఇందులో చూపించిన అంశాలపై అలోచించినా మా ప్రయత్నం సఫలమైనట్లేనని చెప్పుకొచ్చింది.