హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై బడా కంపెనీలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టుల కోసం ల్యాండ్స్ ను పెంచుకుంటోంది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ నిర్వహించిన e-ఆక్షన్ ద్వారా 7.82 ఎకరాలను వేలం వేసింది. ఆ వేలంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ బిడ్ చేసి గెలిచింది. బిడ్ విలువ సుమారు రూ. 550 కోట్లు. ఈ భూమిలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో అపార్ట్మెంట్స్, హై-ఎండ్ హౌసింగ్ నిర్మాణాలు చేయనున్నారు.
ఈ బిడ్ గెలవడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గోడ్రెజ్ ప్రాపర్టీస్ కీలకమైన డెవలపర్‌గా ఎదిగే అవకాశం ఉంది. హైదరాబాద్ మార్కెట్ గ్రోత్ కారణంగా ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. ఇది కంపెనీ షేర్ ప్రైస్‌పై కూడా సానుకూల ప్రభావం చూపింది. గోడ్రెజ్ గ్రూపులోని గోద్రెజ్ ప్రాపర్టీస్ 15 కన్నా ఎక్కు నగరాల్లో ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ డీల్ హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ డిమాండ్ పెరగడాన్ని సూచిస్తుంది, ముఖ్యంగా ORR చుట్టూ ప్రాంతాల్లో. భూమి ధరలు పెరగడం , ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఈ గ్రోత్‌కు కారణం అనుకోవచ్చు.
హైదరాబాద్‌లో సంప్రదాయ బిల్డర్లు మేజర్ ప్లేయర్లుగా ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బడా కంపెనీలు హైదరాబాద్ మార్కెట్ పై కన్నేశాయి. విదేశీ ఆర్కిటెక్చర్ లో.. అత్యంత లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇందు కోసం స్థలాలను భారీ రేట్లను కొనేందుకు వెనుకాడటం లేదు. రియల్ ఎస్టేట్‌కు ప్రస్తుతం కాస్త గడ్డు పరిస్థితి ఉన్నా.. ఈ కంపెనీలు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయంటే.. ముందు ముందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎవరూ ఊహించనంతగా పెరుగుతుందని అంచనా వేయడమే కారణం అని భావిస్తున్నారు.