హైదరాబాద్ కూకట్ పల్లి ఇప్పుడు సిటీ సెంటర్ గా మారింది. రెండుదశాబ్దాల కిందట.. కూకట్ పల్లి ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందా అని చాలా మంది ఊహించలేకపోయారు. ఇప్పుడు ఫిర్జాదిగూడ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. చుట్టూ ఐటీ హబ్‌లు పెరుగుతూండటంతో పాటు.. భౌగోళికంగా పరిస్థితులు కలసి వస్తున్నాయి.
ఫిర్జాదీగూడలో పదేళ్ల క్రితం స్థానిక మేస్త్రీలు మాత్రమే ఇళ్లు కట్టి అమ్మేవారు. ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ అంతా తమ దృష్టి అటు వైపు పెట్టారు. గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాజెక్టులు వేగంగా కడుతున్నారు. రాబోయే మెట్రో ఫేజ్-II ఎక్స్టెన్షన్ ఫిర్జాదీగూడను మరింత యాక్సెసిబుల్‌గా మార్చనుంది, ఇది 2025-26లో ఆస్తి ధరలలో 10-20 శాతం పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫిర్జాదీగూడలో ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు రూ.5,000 నుండి రూ.9,000 వరకు ఉన్నాయి. గత రెండేళ్లలో ధరలు ఏడాదికి 6 శాతం చొప్పున పెరిగాయి. ఈ ప్రాంతంలో 2BHK మరియు 3BHK అపార్ట్మెంట్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫిర్జాదీగూడ వంటి హైదరాబాద్ శివారు ప్రాంతాలు దీర్ఘకాలిక రిటర్న్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే నిపుణులు సలహాలిస్తున్నారు.
ఐటీకారిడార్ వంటి చోట్ల.. అమ్ముడుపోనిఇళ్లు ఎక్కువగా ఉంటున్నాయి.ల కానీ ఫిర్జాదీగూడ వైపు మాత్రం అలాంటి సమస్యలు లేవు. భవిష్యత్ వృద్ధి ఆశాజనకంగా ఉండటంతో .. ఎక్కువ మంది అటు వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో కూకట్ పల్లి తరహాలో ఫిర్జాదీకూడ నివాస, వ్యాపార కేంద్రాలుగా మారే అవకాశం ఉంది.