గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రేట్ల రేషనలైజేషన్‌ను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరటనివ్వనుంది. సిమెంట్ , స్టీల్ వంటి కీలక నిర్మాణ సామగ్రి పై జీఎస్టీని 28% నుంచి 18%కు తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయాలు తగ్గనున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ సెక్టర్‌కు దాదాపు 10-15% వరకు లాభం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ సెక్టర్లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు జీఎస్టీ రేటు 1%గా, రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు 5%గా (ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా) కొనసాగుతుంది. అయితే, లగ్జరీ హోమ్స్ పై 40% స్లాబ్ ప్రతిపాదన ఉంది. ఇది లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్‌కు ఇబ్బందికరమే. డెవలపర్లు ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తారు. అందుకే లగ్జరీ ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
నిర్మాణ సామగ్రి పై జీఎస్టీ తగ్గింపు డెవలపర్లకు లాభమార్జిన్లను పెంచుతుంది. అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రేట్ కట్ రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను పెంచుతుంది , హౌసింగ్ అఫర్డబిలిటీని మెరుగుపరుస్తుందని మార్కెట్ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ వ్యయాలు తగ్గడం వల్ల కొత్త ప్రాజెక్టులు పెరుగుతాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ డిమాండ్ పెరగడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.
జీఎస్టీ రేషనలైజేషన్ రియల్ ఎస్టేట్ సెక్టర్‌కు దీర్ఘకాలిక లాభాలు చేకూరుస్తుంది. రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ మార్పులను ‘గేమ్ చేంజర్’గా అభివర్ణిస్తున్నారు. ఎంత మేర రియల్ బూమ్ ఊపందుకుంటుందో అమల్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది.
