ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకెళ్లిన అరబిందో వారసుడు , విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి మరోసారి ఏపీ సిట్ కు దొరికిపోయినట్లుగా కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ సొమ్మును వైట్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లుగా కొన్ని ఆధారాలు వెల్లడయ్యాయి. చెవిరెడ్డితో పాటు విజయానందరెడ్డి ఇళ్లల్లో జరిగిన సోదాల్లో ఈ విషయం వెల్లడి అయింది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను పెట్టిన ఓ షెల్ కంపెనీ ద్వారా 260 ఎకరాలు కొన్నారు. దానికి రూ. ఆరు కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లుగా రికార్డులు ఉన్నాయి. ఆరు కోట్లకు 260 ఎకరాలు వస్తాయా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాటి యజమానులకు ఎంత ఇచ్చినా అవి నగదు రూపంలోనే ఇచ్చి ఉంటారు. ఇలా కొన్న భూముల్ని రెండు నెలల్లోనే అరబిందో శరత్ చంద్రారెడ్డికి భారీ మొత్తానికి అమ్మేశారు. అంటే అంతా వైట్ అయిపోయాయన్మమాట. ఈ భూముల్ని తనఖా పెట్టుకుని శరత్ చంద్రారెడ్డి పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు.
సిట్ దర్యాప్తులో వెలుగుచూసిన వాటిలో ఓ సూట్ కంపెనీ వ్యవహారమే ఇది. ఇంకా ఐదారు కంపెనీలు చెవిరెడ్డి నడుపుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తే ఇంకా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చెవిరెడ్డి నిర్వాకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాంతో ఆయన ఈ సారి కోర్టులో లేదా బయట మరిన్ని కొత్త డ్రామాలు వేయడం ఖాయమని అనుకోవచ్చు.