ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి తనతో వివాహేతర బంధం పెట్టుకున్న మహిళను హత్య చేసినట్లుగా ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన వార్తా కథనం రాసింది. జగన్ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆయన బాగా డబ్బు సంపాదించిన ఆయన ఆ మాయలో కుటుంబాన్ని సైతం నిర్లక్ష్యం చేసి ఆ మహిళ మోజులోసహజీవనం చేశాడని ఇప్పుడు అనుమానం పెంచుకుని.. తీవ్రంగా దాడి చేయడంతో తలకు గట్టి దెబ్బ తగిలి ఆమె చనిపోయిందని ఆంధ్రజ్యోతి ప్రకటించింది. అయితే ఆ ఐఏఎస్ ఎవరు అన్నది మాత్రం రాయలేదు. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది.
ఆవేశంలో దాడి చేస్తే ఆమె గాయపడి చనిపోయిందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. అలా చేసినా అది హత్యా నేరమే అవుతుంది. నిజానికి ఇలాంటి గాసిప్ మీడియా ప్రతినిధుల వరకూ వచ్చిందంటే ఆ ఐఏఎస్ ఎవరో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అధికారవర్గాల్లో ఇప్పటికే ఆయన ఎవరో అందరికీ క్లారిటీ ఉంది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వేరే మహిళతో ఉంటున్న ఐఏఎస్.. అనారోగ్యానికి గురై కోలుకున్న ఆయన ఎవరో ఏపీ సచివాలయంలో అందరికీ తెలిసిపోయింది. ఆయనే స్వయంగా ఆ మహిళను ఆస్పత్రిలో చేర్చారని కానీ అప్పటికే చనిపోయిందని.. తన పరిచయాలతో మెడికో లీగల్ కేసు కాకుండా లాంఛనాలు పూర్తి చేసి వచ్చారని చెబుతున్నారు.
జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించినట్లుగా ఆంధ్రజ్యోతి తేల్చడంతో ఆ అధికారికి ఇప్పుడు అసలు సెగ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓ మహిళను హత్య చేసి ఏమీ తెలియనట్లుగా సైలెంటుగా వచ్చి విధుల్లో పాల్గొంటున్నారని అంటున్నారు. ఈ ఐఏఎస్‌పై ఇక నుంచి విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. ఆయనే బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి రావొచ్చు.
