ఏపీలో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని .. జగన్ రెడ్డి వాటిని కట్టారని వైసీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. చాలా మంది మేధావులు అసలు విషయం పై అవగాహన ఉందో లేదో కూడా తెలియకుండా మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం మంచిది కాదని సలహాలిచ్చేస్తున్నారు. నిజంగా ఏపీలో మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.
కేంద్రం జిల్లాకో మెడికల్ కాలేజీ ఇవ్వాలన్న పాలసీ పెట్టుకుంది. ఆ ప్రకారం జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే పలు పదికిపైగా మెడికల్ కాలేజీలు కట్టుకునే అవకాశం కల్పించింది. ఐదు సంవత్సరాల్లో కట్టింది నాలుగు మెడికల్ కాలేజీలు. వాటిలోనూ క్లాసుల పారంభం కాలేదు. మిగిలిన కాలేజీలకు పెద్ద ఎత్తున భూములు సేకరించి.. పునాదులు మాత్రం వేశారు. వేల కోట్లు అవసరం అయితే వందల కోట్లు ఖర్చు పెట్టలేదు. ఒక్క పులివెందుల కాలేజీ భవనాలు మాత్రం నిర్మించి..జగన్ రిబ్బన్ కట్ చేశారు. మిగతాకాలేజీల ను చూస్తే వాటి దుస్థితి ఎలా ఉందో అర్థమైపోతుంది.
మెడికల్ కాలేజీ అంటే భవనాలు నిర్మించి.. అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి.. ప్రారంభించాల్సి ఉంటుంది. అసలు నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా.. సగంలో పెట్టి.. ఏదో జగన్ రెడ్డి సంపాదించి పెట్టిపోయిన ఆస్తిని అమ్మేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. మెడికల్ కాలేజీను ప్రభుత్వాలు నిర్వహించడం కన్నా ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిర్వహిస్తే ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని.. ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్న ఉద్దేశంతోనే పీపీపీ మోడ్‌లోకి మార్చాలని ప్రభుత్వం అనుకుంటోంది.
దీని వల్ల ఫీజులు పెరగవు. ఉచిత సీట్లు మారవు. అన్నీ తెలిసినా వైసీపీ జగన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పుకోవడానికి వైసీపీ నేతలు ఆరాటపడుతున్నారు. ప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి చేసిందేమిటో తెలుసుకున్న వారికి మాత్రం క్లారిటీ ఉంది.