రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా ఆల్బమ్‌ను పర్సనల్‌గా తీసుకున్నట్లుగా ఉంది. నువ్వుంటే చాలే పాట కోసం లిరిక్స్ రాశారు. ఆ పాట జనాల్లోకి బాగానే వెళ్లింది. ఇప్పుడు రెండో సింగిల్ “పప్పీ షేమ్”తో సింగర్‌గా మారారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. వివేక్ & మెర్విన్ పప్పీ షేమ్ సాంగ్ కోసం యూత్‌ఫుల్ బీట్స్‌తో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్ హంగామాను ప్రజెంట్ చేస్తూ ఓ ట్యూన్ చేశారు.
భాస్కరభట్ల రాసిన క్యాచి లిరిక్స్ వినోదాన్ని రెట్టింపు చేశాయి. రామ్ తొలిసారిగా పాడిన ఈ సాంగ్‌లో ఆయన వోకల్స్ ఎనర్జీ, వైబ్ తీసుకొచ్చాయి. తన గ్యాంగ్‌తో కలిసి తమ అభిమాన స్టార్ చిత్రం విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఓడిపోయిన యాంటీ-ఫ్యాన్స్‌పై ఫన్‌గా ట్రోల్ చేయడం, ఫ్యాండమ్ పవర్, స్టార్ మానియా, మాడ్నెస్ను చూపించాయి. ఇది ఓ అభిమాని బయోపిక్‌గా తెరకెక్కుతోంది. అభిమాన హీరోగా ఉపేంద్ర నటిస్తున్నారు. నవంబర్ 28న సినిమా రిలీజ్ కానుంది.