నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు నిద్రహారాలు మానేసి పని చేసింది. నారా లోకేష్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే అన్నీ సమన్వయం చేసుకుని అందరూ ఏపీలో ల్యాండ్ అయ్యే వరకూ అవిశ్రాంతంగా పని చేశారు. నారాలోకేశ్ చేసిన పనికి ప్రశంసలు లభించాయి. ఇతరుల సంగతి పక్కన పెడితే.. అత్యంత ఘోరమైన పరిస్థితుల్ని చూసిన నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులు ప్రభుత్వం తమ కోసం పడిన కష్టాన్ని గుర్తించారు. తమ కుటుంబసభ్యుడిగా కేర్ తీసుకుని తమను తీసుకు వచ్చారని వారంతా నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు ప్రజల్ని రక్షించడం వైసీపీకి ఇష్టం లేదు !
కానీ ప్రజల్ని ప్రత్యేక దృష్టి పెట్టి సాయపడి..కాపాడి తీసుకు వచ్చినా కొంత మంది ఏడుస్తూనే ఉన్నారు. అది నారా లోకేష్ చేయాల్సిన పని కాదని కొంత మంది.. కేంద్ర ప్రభుత్వం చేసిందని కొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. అసలు కమాండ్ కంట్రోల్ లో కూర్చుని ఎలా సాయం చేస్తారని మరికొందరు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. వీళ్ల బాధ ఒక్కటే.. ప్రజల్ని రక్షించడం. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియాలో..సోషల్ మీడియాలో ఇదిగో సాయం చేశాం.. అదిగో రక్షించాం అని ప్రచారం చేసుకోవడం తప్ప ఎలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ … ఇతర చోట్ల చిక్కుకుపోయిన ఏపీ వాసుల్ని కాపాడే ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ఉంటే.. మాత్రం వారికి కడుపు రగిలిపోతోంది.
అసహ్యించుకునే రాజకీయాలు చేయడం వైసీపీ DNA
ప్రజలు కష్టాలు పడాలి … వారు నష్టపోవాలి.. అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని ఈ విపక్ష నేతలు అనుకుంటూ ఉంటారు. అందుకే ప్రభుత్వం సమర్థంగా పని చేసినా వారు తట్టుకోలేరు. ఇలాంటి విపక్షం దేశంలో ఎక్కడా ఉండదేమో..?. అసెంబ్లీలో స్పీకర్ ప్రతిపక్షంగా గుర్తించలేదు కాబట్టి తాము విపక్షం కూడా కాదని..తమకు బాధ్యతల్లేవని ఇలా .. మానసిక హింసోన్మాదులుగా పని చేస్తారేమో కానీ.. అలాంటి వారి పట్ల ప్రజలు కూడా అసహ్యించుకునే రోజులు వచ్చేశాయి. వాళ్లకు పదకొండు సీట్లు రావడం తప్పు లేదని.. ప్రతీ సారి నిరూపించుకునేలా.. ప్రజల విషయంలో వారి ప్రవర్తన ఉంటోంది.
నారా లోకేష్‌కు దేశవ్యాప్త ప్రశంసలు
నారా లోకేష్.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు ప్రజల పట్ల, వారిని రక్షించి తీసుకు వచ్చేందుకు చూపించిన కార్యదక్షత పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నేపాల్‌లో తెలుగువారు ఎక్కడెక్కడ చిక్కుకున్నారో తెలుసుకోవడం దగ్గర నుంచి వారిని ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం.. అక్కడి నుంచి భారత్ లోకి అడుగుపెట్టేలా చేయడం లో ఆయన చూపించిన నాయకత్వ సమర్థత.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఆయన పనితీరును అభినందిస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. ప్రజల్ని కాపాడేశారని.. తమకు రాజకీయం చేసుకునే అవకాశం లేదని ఏడుస్తున్నారు. ఇలాంటి పార్టీ ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం ఏమో ?