సోషల్ మీడియా సైకోల టీమ్ ఉందని ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయించడం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ స్టైల్. తల్లి , చెల్లి అనే మినహాయింపులేమీ ఆయన పెట్టుకోరు. ఇప్పుడు ఆయన మేనల్లుడిపైనా పడ్డారు. ఇంకా రాజకీయాల్లోకి అడుగే పెట్టలేదు.. కానీ పెట్టే ఆలోచనలు ఉన్నాయని తెలియగానే ఆయన పై దాడి ప్రారంభించారు. చంద్రబాబు చెబితేనే రాజకీయాల్లోకి రాజారెడ్డి వస్తున్నారని ప్రచారం ప్రారంభించేశారు. ఇప్పటికే తల్లి, చెల్లి వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారాన్ని చేసి అభాసుపాలయ్యారు. ఇప్పుడు మేనల్లుడి మీద పడ్డారు.
వ్యక్తిత్వ హననం చేస్తే వైఎస్ రాజారెడ్డి వైఎస్ఆర్ మనవడు కాకుండా పోతాడా ?
రాజారెడ్డి బైబిల్ పాఠాలు చెబుతున్నారు. ఆయన మంచి వక్త అయ్యే అవకాశం ఉంది. జగన్ రెడ్డికి లేనిది అదే. ఆయన నిజంగా మరికాస్త ట్రైనింగ్ అయి.. రాజకీయ ప్రసంగాలు బాగా చేస్తే.. ముఖ్యంగా బైబిల్ పాఠాల్లా చెబితే జగన్ రెడ్డి ఓటు బ్యాంక్ చెల్లా చెదురు అవుతుంది. ఆయనను గుడ్డిగా నమ్మే కన్వర్టడ్ క్రిస్టియన్లు రాజారెడ్డి వైపు వెళ్లిపోతారు. ఇది జగన్ రెడ్డికి చేసే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఆయన వైఎస్ మనవడు కాదని.. చంద్రబాబు చెబితేనే రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కానీ జగన్ రెడ్డి వదులుకున్నంత ఈజీగా బంధాలు పోవుగా !
వైఎస్ వారసుడు అయితే బీజేపీతో కలుస్తారా ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు అయితే బీజేపీతో ఎందుకు కలుస్తారని.. వైఎస్ షర్మిల అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సిన ఉంది. తండ్రికి జగన్ రెడ్డి వెన్నుపోటు కాదని.. ఎదురుగానే గుండెల్లో కత్తి దింపారని అంటున్నారు. పదేళ్ల నుంచి బీజేపీకి ఊడిగం చేస్తూ.. వైఎస్ వారసుడ్నని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ తన జీవిత కాలం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేస్తున్నారు. షర్మిల అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సి ఉంది.
నేరుగా గ్రౌండ్ కోల్పోతున్న వైసీపీ
వైసీపీ అధినేత జగన్ విధానాలతో.. ఆ పార్టీ పూర్తిగా తమను నమ్మిన వారిని నట్టేట ముంచుతోంది. ఫలితంగా వారంతా జగన్ రెడ్డికి దూరమవుతున్నారు. ఈ పరిణామాలు వరుసగా కనిపిస్తున్నా.. జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇతరులపై తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలు చేయించి.. తాను చేసేదే రాజకీయం అనుకుంటున్నారు. ఆయనంతటకు ఆయన పాతాళం దాటి దిగువకు వెళ్తూంటే.. ఎవరు మాత్రం ఆపుతారన్నట్లుగా పరిస్థితి మారింది.