పవన్ కళ్యాణ్ ఓజీపై నెలకొన్న హైప్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ఓజీ గురించే చర్చ. ఓజీ హైప్ కి హీరో సిద్ధు జొన్నలగడ్డ వేసిన ట్వీట్ బెస్ట్ ఎగ్జాంపుల్. “ఓజీ హైప్ తో నా హెల్త్ అప్సెట్ అవుతోంది. 25 వరకు ఉంటామో.. పోతామో కూడా తెలియట్లేదు” అంటూ ఆయన రాసిన మాటలు ఓజీ హైప్ ని ప్రతిబింబిస్తున్నాయి.
విశేషమేమిటంటే, ఈ హైప్‌ను మేకర్స్ ప్రత్యేకంగా క్రియేట్ చేసింది కాదు. ఇంకా ట్రైలర్ విడుదల కాలేదు. వచ్చిన గ్లింప్స్, టీజర్లు, లిరికల్ వీడియోల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి సంబంధించిన చిన్న చిన్న విజువల్స్ తప్పితే పెద్దగా ఏమీ చూపలేదు. అయినా ఆ కొద్దిపాటి క్లిప్స్, మ్యూజిక్ చూసే హైప్ తారస్థాయికి వెళ్ళింది.
కానీ ఇంత హైప్ మంచిదా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సినిమాలు భారీ హైప్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కష్టాలు పడ్డాయి. రజనీ కబాలి ఒక బిజీఎం విజువల్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ రోజు కొన్ని కంపెనీలు సెలవులు కూడా ప్రకటించాయి. కానీ ఆ హైప్ కి సినిమా మ్యాచ్ కాలేదు. మొన్న వచ్చిన కూలీకి కూడ ఇదే జరిగింది. భారీ హైప్ కొంపముంచింది. ఆ హైప్ కి సినిమా కంటెంట్ కి ఎంతమాత్రం మ్యాచ్ కాలేదు.
ఇప్పుడు ఓజీకి కూడా ఇలాంటి భయం ఎదోమూలన వుంది. ఇంత హైప్ పెరిగినప్పుడు హిట్ సినిమా కూడా యావరేజ్ గా అనిపించే ఛాన్స్ ఎక్కువ. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద హిట్ కావాలి. ఆ హిట్ ఓజీ వస్తుందని అందరి నమ్మకం. అయితే ఈ విజయానికి హైప్ ప్రతిబంధకం కాకూడదు.