అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై తీసుకున్న నిర్ణయం కొత్త ప్రకటనకు సంతకం చేశారు. ఈ ప్రకటన పై అనేక సందేహాలు వచ్చాయి. దీంతో కంపెనీలు, H1Bవీసా హోల్డర్లు కంగారు పడిపోయాయి. ఉన్న పళంగా అందరూ ఆమెరికాకు వచ్చేయాలని తమ ఉద్యోగులకు కంపెనీలు సందేశాలు పంపించాయి. దీంతో వైట్ హైస్ మరింత క్లారిటీ ఇచ్చింది. గందరగోళాన్ని తగ్గించేందుకు వైట్ హౌస్ అధికారులు , ఇమ్మిగ్రేషన్ నిపుణులు స్పష్టమైన వివరాలు ఇచ్చారు. ఈ ఫీ వార్షిక ఛార్జ్ కాదు, కేవలం పిటిషన్‌కు ఒక్కసారి వర్తించే మొత్తం అని, ప్రస్తుత వీసా హోల్డర్లపై ఎటువంటి ప్రభావం లేదని చెబుతున్నారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అబిగైల్ జాక్సన్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
1.ఒక్కసారి ఫీజు, వార్షికం కాదు: లక్షడాలర్ల 100,000 ఫీజు H-1B పిటిషన్ (కంపెనీ స్పాన్సర్షిప్ అప్లికేషన్)కు మాత్రమే వర్తిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వార్షిక ఫీజు కాదు. ” కేవలం ప్రవేశానికి సంబంధించిన ఒక్కసారి చార్జ్” .
2. ప్రస్తుత H-1B హోల్డర్లపై ఎటువంటి ప్రభావం లేదు: ఇప్పటికే H-1B వీసా ఉన్నవారు, ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నప్పటికీ, 100,000 డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. “ప్రస్తుత వీసా హోల్డర్లు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు.” తాజా నిర్ణయం ప్రయాణ హక్కులను మార్చదు.
3. కొత్త వీసాలకు మాత్రమే, రెన్యూవల్స్ లేదా ప్రస్తుత హోల్డర్లకు కాదు: ఈ ఫీజు కేవలం కొత్త H-1B అప్లికేషన్లకు వర్తిస్తుంది. రెన్యూవల్స్ (వీసా పొడిగింపు) లేదా ఇప్పటికే వీసా ఉన్నవారి మార్పులకు ఇది వర్తించదు. మొదటిసారి 2026 ఫిబ్రవరి లాటరీ సైకిల్‌కు వర్తిస్తుంది. 2025 లాటరీలో పాల్గొన్నవారు ఈ మార్పు నుంచి మినహాయింపు పొందారు.
2025 మొదటి ఆరు నెలల్లో అమెజాన్ 10,000కి పైగా H-1B వీసాలు, మైక్రోసాఫ్ట్, మెటా 5,000కి పైగా అప్రూవల్స్ పొందాయి. తాజా ఫీజు ప్రభావం వాటిపై ఉండదు. కొత్తగా తీసుకునే H1B స్పాన్సర్డ్ వీసాలకే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
