వైఎస్ఆర్సీపీలో భారతి పట్టు పెంచుకుంటున్నారని రాజకీయ కార్యకలాపాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని కొత్తగా ప్రచారం ప్రారంభమయింది. ఆమె ఇప్పటి వరకూ నేరుగా రాజకీయాలు చేయలేదని చెప్పడమే విచిత్రమైన విషయం. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై వైఎస్ భారతి ప్రభావం ఉంటుందని .. ఆయన రిమోట్ కంట్రోల్ ఆమె దగ్గర ఉంటుందని చాలా మందికి క్లారిటీ ఉందు. జగన్ సోదరి షర్మిల ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు కూడా. ఇప్పుడు కొత్తగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే అది వింత లేదా కొత్త కాదు.
భారతి మద్దతుతోనే పార్టీలో పదవులు, ఇంచార్జ్ పోస్టులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత వైఎస్ భారతి ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగిపోయింది. విజయసాయిరెడ్డి లాంటివాళ్లు.. జగన్ తో పాటు నేరుగా భారతికి కూడా కృతజ్ఞతలు చెప్పేవారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు కానీ.. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎవరికి ఇవ్వాలన్నది డిసైడ్ చేసింది.. జగన్ ఫ్యామిలీనే అన్నది క్లారిటీ ఉంది. ఆమె ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థ ద్వారా పార్టీని కంట్రోల్ చేసేవారు. ఇప్పటికీ ఆ వ్యవస్థ కొనసాగుతోంది.
ధనుంజయ్ రెడ్డినే భారతి ప్రతినిధి
ధనుంజయ్ రెడ్డి వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలు కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. చాలా మంది సజ్జల పేరు చెబుతారు. కానీ అసలు వ్యవహారాలు చక్కబెట్టింది ధనుంజయ్ రెడ్డి. ఆ బాధలు అనుభవించిన వారికి తెలుసు. ధనుంజయ్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే.. భారతి ద్వారానే. ఆమె ప్రతినిధిగానే అటు సీఎంవోను.. ఇటు పార్టీ ని ధనుంజయ్ రెడ్డి నడిపించారు. మొత్తానికి నాశనం చేశారు.
జగన్ జైలుకెళ్తే భారతి తప్ప మరో ఆప్షన్ లేదు – అందుకే కదా ఫ్యామిలీలోనూ చిచ్చు
జగన్ ఎప్పటికైనా జైలుకెళ్తాడని చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ కుటుంబానికీ తెలుసు. అందుకే జగన్ తరవాత ఎవరు అన్నదానిపై ఆ కుటుంబంలో చాలా రాజకీయాలు జరిగాయి. చివరికి విజయమ్మ,షర్మిల బయటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క భారతినే మిగిలారు. ఇప్పుడు ఆమె కొత్తగా వైసీపీలో జోక్యం చేసుకుంటున్నారని.. పార్టీని చక్కబెడుతున్నారని అనుకోవడం రాజకీయంగా అవగాహన లేకపోవడమే అవుతుంది. ఇప్పటికే పార్టీని భారతి కంట్రోల్ చేస్తున్నారు. జగన్ జైలుకెళ్తే అది ప్రత్యక్షంగా జరిగే అవకాశం ఉంది.