ట్విస్ట్ : రానాదీ ల‌వ్ మ్యారేజేనా??

రానా చేసిన సినిమాలు త‌క్కువే అయినా.. గాసిప్పుల్లో మాత్రం ఎక్కువ‌గా క‌నిపించేవాడు.. వినిపించేవాడు. బిపాసాబ‌సుతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడ‌ని అప్ప‌ట్లో చెప్పుకొన్నారు. ఆ త‌ర‌వాత‌… త్రిష పేరు రానాతో లింక‌ప్ అయి వినిపించింది. ఈమ‌ధ్య ఓ క‌థానాయిక‌తో బాగా చ‌నువుగా ఉంటున్నాడ‌ని టాక్‌. అయితే ఈ నేప‌థ్యంలో రానా పెళ్లిపై సురేష్ బాబు చేసిన వ్యాఖ్య‌లు కాస్త ఆసక్తిని క‌లిగిస్తున్నాయి. రానాకి పెళ్లెప్పుడు చేస్తారు??? అని అడిగితే ”యేడాదిలో చేస్తాం.. కానీ సంబంధం మేం చూడాలో, వాడే చూసుకొన్నాడో తెలియ‌డం లేదు.. ఎవ‌రిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే నిర్ణ‌యం వాడి చేతుల్లోనే ఉంది” అన్నారాయ‌న‌.

అంటే.. రానా ల‌వ్‌లో ఉన్న‌ట్టే క‌దా? ఆల్రెడీ ఆ కుటుంబానికి నాగ‌చైత‌న్య ఓ షాక్ ఇచ్చాడు. చైతూ స‌మంత‌తో ల‌వ్‌లో ఉన్నాడ‌ని, వాళ్లిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన ర‌హ‌స్య‌మే. ఇప్పుడు రానా కూడా చైతూని ఫాలో అయిపోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. రానా దృష్టి ప్ర‌స్తుతం బాహుబ‌లి 2, ఘాజీ చిత్రాల‌పై ఉన్నాయి. బాహుబ‌లి 2017 ఏప్రిల్‌లో విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాతే.. రానా పెళ్ల‌య్యే ఛాన్సుంది. మ‌రి పెళ్లికూతురు ఎవ‌రో, పెళ్లి కూతుర్ని ఎంచుకొనే ఛాయిస్ ఫ్యామిలీకి ఇస్తాడో లేదో… రానాకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close