సోషల్ మీడియాలో అభిప్రాయాలు సైకోయిజం స్థాయికి చేరిపోయి.. కన్నుమిన్నూ కానరకాపోతే ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. భావవక్తీకరణ స్వేచ్ఛ ఉంది కానీ అదే సమయంలో బాధ్యతలు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో నలుగురు శభాష్ అంటున్నారని.. పనికి మాలిన వాళ్లు అహో.. ఓహో అంటున్నారని రెచ్చిపోతే మొదటికే మోసం. వస్తుంది.
చిత్తూరు జిల్లాలో పని చేసే వాణిజ్యపన్నుల శాఖ అధికారి సుభాష్ ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే పేరుతో ఫేస్ బుక్ లో ఆయన చాలా అతి మేధావి ప్రకటనలు చేస్తూంటారు . తానేదో సమాజ సేవ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తారు. రాను రాను ఆ మంచితనం కాస్తా రాజకీయ అభిప్రాయాలతో వికృతం చేసుకున్నారు. ప్రధాని మోదీపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. తర్వాత అమరావతిపైనా విషం చిమ్మడం ప్రారంభించారు. వైసీపీ టూల్ కిట్ నుంచి వచ్చే పోస్టుల్ని తన వాల్ పై పోస్టు చేయడం ప్రారంభించారు.
అమరావతిలో ఓ రిజర్వాయర్ కడుతున్నారంటే.. ఎందుకు మొత్తం అమరావతినే రిజర్వాయర్ చేయవచ్చని సెటైర్లు వేయడం, ఎక్కడో పొలాల్లో నిలబడిపోయి నీటిని చూపించి అమరావతి మునిగిపోయిందని చెప్పడం.. ఇలాంటివి లెక్కలేనన్ని చూశారు. చాలా రోజులు చూశారు కానీ.. రాను రాను శృతి మించడంతో ఇక కదలాలని అనుకోలేదు. విచారణ చేయించారు. ఆయన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తేలింది. తానే ఆ పోస్టులు పెట్టానని అంగీకరించారు. చివరికి సస్పెండ్ అయ్యారు.
ఆయనకు నోటీసులు జారీ చేసినప్పుడు వియ్ స్టాండ్ విత్ సుభాష్ అని వైసీపీ వాళ్లు పోస్టర్లు వేశారు. ఇప్పుడు కూడా వేస్తారేమో . కానీ తాను చేసిన తప్పులకు ఇలాంటి వారి సపోర్టు లభిస్తుంది కానీ.. శిక్ష మాత్రం ఆయనే అనుభవిస్తున్నారు.
