శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. శాసనమండలి చైర్మన్ ఆ పార్టీ నేతే. అయినా విపక్ష నేతగా ఉన్న బొత్స సబ్జెక్టుతో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనుకోవడం లేదు. ఇదిగో లోకేష్ ఇలా అన్నారు..అన్నది కూడా మా మహిళా ఎమ్మెల్సీ వరుదు కల్యాణినే. మహిళలను అవమానిస్తారా అని బొత్స ఆరోపించాడు. ఆయన అలా అనే వరకూ లోకేష్ .. ఏమన్నారు.. అందులో వరుదు కల్యాణిని ఏమన్నారో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి అంతకు ముందు వరకూ ఆయన సభలో లేడు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని ప్రభుత్వం నేరుగా చెబుతున్నప్పటికీ.. అదిగో ప్రైవేటీకరణ.. అదిగో ప్రైవేటీకరణ అని వైసీపీ వాదిస్తోంది. అదే సమయంలో జగనే ప్రైవేటీకరణ ఆపారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఏం పీకలేదని లోకష్ స్పష్టం చేశారు. ఈ విషయం బొత్సకు వైసీపీ ఆఫీసు నుంచి సందేశం వచ్చిందేమో కానీ.. వెంటనే అసెంబ్లీలోకి వచ్చి మహిళల్ని అవమానించారని ఎత్తుకున్నారు.
కానీ లోకేష్ బొత్సను కడిగిపారేశారు. నిండు సభలో కౌరవుల్లా కూర్చుని మా తల్లిని అవమానించినప్పుడు నోరు రాలేదా అని మండిపడ్డారు.దీంతో తల్లిని రాజకీయానికి వాడుకోవద్దని బొత్స చెప్పుకొచ్చారు. వారు అత్యంత ఘోరంగా చేసిన.. అదీ కూడా అసెంబ్లీలో చేసిన నిర్వాకాలను చెప్పవద్దంటారు.. లోకేష్ ఏమీ అనకపోయినా అన్నారంటూ రచ్చ చేయడానికి మాత్రం ముందుకు వస్తారు. మంత్రి అనిత సహా.. ఇతర నేతలు బొత్సపై మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని బొత్సకు తెలిసినా ఆయన మాత్రం.. సజ్జల టీం నుంచి వచ్చినట్లుగా మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయ్యారు.
