రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యను నియమించడం వైసీపీలో దిగ్భ్రాంతికి గురి చేసింది. గత ఎన్నికల్లో రాజోల్ సీటును జనసేనకు కేటాయించడం ఖాయం కావడంతో గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. జనసేన తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలోనే ఉన్నారు. ఆయనకు హ్యాండిచ్చిన జగన్ ఎంపీగా పోటీ చేయించారు. కానీ సూర్యారావు జనసేన పార్టీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
అప్పటి నుంచి అటు రాపాక.. ఇటు గొల్లపల్లి కూడా వైసీపీని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు టీడీపీ ఇంచార్జ్ గా అమూల్యను నియమించడంతో అయన ఇక వైసీపీకి పని చేయడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కూతురితో తనకు సంబంధం లేదని గొల్లపల్లి చెప్పుకుంటున్నారు. సూర్యారావు వైసీపీలో చేరిన ఆయన కుమార్తె అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ జనసేన విజయం కోసం పని చేశారు. పార్టీ అధిష్టానం దృష్టిలో గుర్తింపు పొంది ఇప్పడు నియోజకవర్గ ఇంచార్జ్ స్థాయిని అందుకున్నారు. పార్టీ క్యాడర్ కూడా ఆమె పేరునే సూచించారు.
ఇప్పుడు గొల్లపల్లి తాను వైసీపీ నేతనేనని.. తానే ఇంచార్జును అని చెప్పుకున్నా జగన్ రెడ్డి నమ్మే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ గురించి అందరికీ తెలుసు . కుమార్తె కోసం గొల్లపల్లి పార్టీని తాకట్టు పెట్టేస్తాడని అనుమానిస్తారు. నిస్సంకోచంగా పక్కన పడేస్తారు.ఇప్పుడు రాజోలులో వైసీపీకి లీడే కాదు..కనీసం క్యాడర్ కూడా లేకుండా పోయింది.
