రాజకీయ పార్టీల వ్యూహకర్తలు దివాలా తీశారని వారి దగ్గర.. ఇక ఐడియాలే లేవని తెలుసుకోవడానికి ఆ పార్టీల రాజకీయాలు చూస్తే అర్థమైపోతుంది. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఇరుుకున పెట్టేయవచ్చని పాస్టర్ మత్తయ్యను రంగంలోకి తెచ్చారు. ఆయనను ఢిల్లీకి తీసుకుపోయి చీఫ్ జస్టిస్‌కు ఓ బహిరంగ లేఖ అని చెప్పి.. పాత ఆరోపణలన్నీ మళ్లీ చెప్పించారు. ఇలాంటి రాజకీయాలు చూసి నవ్వుకునే రోజులు ఎప్పుడో వచ్చాయి. కానీ వైసీపీ, బీఆర్ఎస్ ప్లానర్లకు మాత్రం ఇది క్రియేటివిటీ అనిపించింది.
ఆ కేసు మొత్తం ఎప్పుడో తేలిపోయింది. చంద్రబాబుకు సంబంధం లేదని కూడా తేల్చారు. అసలు ఏ నివేదికలోనూ ఆయన పేరు లేదు. కానీ ఇప్పటికి పాస్టర్ మత్తయ్యలను వాడుకుని ఆయన పేరును వైసీపీ, బీఆర్ఎస్ ఇంక్లూడ్ చేస్తూనే ఉంటుంది. ఆ కేసు అసలు సుప్రీంకోర్టులో ఉంది. ఇలాంటి సమయంలో ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. కానీ.. ఏదో విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి.. తమపై పడుతున్న మరకల్ని జనరలైజ్ చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
మత్తయ్య మాటల్నే సీరియస్ గా తీసుకోవాలనుకుంటే ఆయన దర్యాప్తు సంస్థకు ఇచ్చిన వాంగ్మూలాలే కీలకం. రేవంత్ రెడ్డిపై ట్రాప్ వేసినప్పుడు ఆయన సంచలన విషయాలు చెప్పారు. అసలు స్టీవెన్సనే డబ్బుల కోసం తన వద్దకు వచ్చాడని చెప్పాడు. దీన్ని బట్టి ట్రాప్ చేసింది పక్కా ప్లానింగ్ తోనే అనేది స్పష్టమవుతోంది. అప్పటి ఏసీబీ దర్యాప్తు కేసీఆర్ ప్రభుత్వం చేతుల్లో ఉండేది. అయినా మత్తయ్య కుట్రలన్నీ అప్పట్లో బయటపెట్టాడు. ఇప్పుడేమో ఆయనను పట్టుకుని లేఖలు రాయిస్తూ.. వింత ప్రయత్నాలు చేస్తున్నారు.
