ఒక వ్యక్తిపై అభిమానం మాటల్లో చెప్పడం కాదు.. అవసరం వచ్చినప్పుడు ఎంతకైనా నిలబడాలి. నష్టం కలుగుతుందని తెలిసినా వెనకడుగు వేయకూడదు. ఇలాంటి అభిమానం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఏదో ముఖస్తుతి కోసం నాలుగు మాటలు చెప్పి స్టేజ్ దిగిపోవడమే అభిమానంగా చలామణీ అవుతున్న ఈ రోజుల్లో అసలు అభిమానం అంటే ఎలా ఉంటుందో చూపించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రం కోసం ‘మిరాయ్’ నిర్మాత విశ్వప్రసాద్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 12 వచ్చిన ‘మిరాయ్’ ఇప్పటికీ మంచి ఫుట్‌ఫాల్స్‌తో రన్ అవుతోంది. అయితే సెప్టెంబర్ 25న ‘మిరాయ్’ థియేటర్స్ కొన్నింటి ‘ఓజీ’కి ఇచ్చారు. మళ్లీ సెప్టెంబర్ 26 నుంచి యథాతథంగా ఆ థియేటర్స్‌లో ‘మిరాయ్’ను ఆడిస్తారు. డీసెంట్‌గా ఆడుతున్న సినిమాను ఒక రోజు తీసేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంత అభిమానం ఉంటే కానీ ఇలా చేయలేరు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపధ్యంలో సినిమా ఇండస్ట్రీని పిలిచి ఓ పార్టీ ఇచ్చారు విశ్వప్రసాద్. ఇప్పుడు ‘ఓజీ’కి థియేటర్స్ ఇచ్చి అసలైన అభిమానం చాటారు.
