తెలంగాణ ప్రభుత్వ సిఫారసు చేసిన కాళేశ్వరం అక్రమాలపై విచారణను సీబీఐ ప్రారంభించింది. ముందుగా కాళేశ్వరంకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్తుగా తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది. అందుకే సీబీఐ ఇతర మార్గాల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకుంటోంది. ప్రాజెక్టు అనుమతులు, నిధులు, ఆర్థిక అవకతవకలు, వివిధ సంస్థల రిపోర్టులు అన్నింటినీ పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నోటీసులు, విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని హైకోర్టు చెప్పినందున.. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకోరు. కానీ అందులో ఉన్న సమాచారం అంతా ప్రభుత్వం సీబీఐకి ఇస్తుంది. అందుకే .., నిందితుల్ని గుర్తించి కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.
జస్టిస్ పీసీ ఘోష్ సిఫారసు చేసిన విధంగా చర్యలు తీసుకుంటే.. ఇక ప్రత్యేకంగా పరిశీలన చేయకుండా కేసులు పెట్టి అరెస్టులతో ప్రారంభించవచ్చు.కానీ కోర్టు ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సీబీఐ రంగంలోకి దిగడం బీఆర్ఎస్ వర్గాలను షాక్ గురి చేస్తోంది. సీఎం రేవంత్ ఇటీవల. కేటీఆర్ సూచనలతోనే కిషన్ రెడ్డి సీబీఐ విచారణను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది.