వైసీపీ ఎమ్మెల్సీ ఏసురత్నం కూడా వైసీపీకి షాకిచ్చారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా మండలిలో మాట్లాడారు. వైసీపీ మూకలు హత్య చేసిన చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్టసవరణ బిల్లు మండలికి వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ ఆ బిల్లును వ్యతిరేకించారు. కానీ ఈ బిల్లుపై మాట్లాడిన ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాత్రం స్వాగతించారు. దీంతో బొత్స సత్యనారాయణ కంగారు పడి.. ఏయ్ అంటూ ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఏసు రత్నం తాను చెప్పాలనుకున్నది చెప్పారు.
ఫ్యాక్షన్, రాజకీయ హత్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉద్యోగం ఇవ్వాలని..ఏసురత్నం అన్నారు. చంద్రయ్య బీసీ బిడ్డ అన్నారు. బీసీ బిడ్డ కుటుంబానికి అండగా ఉండటం మంచిదేనన్నారు. తాను స్వాగతిస్తున్నానన్నారు. ఆ చంద్రయ్య నువైసీపీ నేతలే దారుణంగా హత్య చేశారు. ఆ విషయం ఆయనకు తెలియకుండా ఉండదు.
దీంతో ఏసురత్నం కూడా ఇక వైసీపీకి లేరని వైసీపీ నేతలు ఫిక్సయిపోతున్నారు. చంద్రగిరి ఏసురత్నం ప్రభుత్వ అధికారిగా ఉంటూ వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా గెలవలేదు. తర్వాత నామినేటేడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన బీసీ సెంటిమెంట్ తో మండలిలోనే వైసీపీని ఇబ్బంది పెట్టారు.
వైసీపీ హయాంలో ఎంతో మంది బీసీ బిడ్డలను చంపారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్యలు జరిగాయి.అందుకే కూటమి బీసీ రక్షణ చట్టం తీసుకు వస్తామని హామీ ఇచ్చింది. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ మండలిలో ఆగిపోయింది. ఇవాళ కాకపోతే వచ్చే ఎన్నికల్లో అయినా బిల్లును ఆమోదిస్తారు. కానీ చంద్రగిరి ఏసురత్నం చేసిన కామెంట్ల వల్ల బీసీల పట్ల వైసీపీ వ్యవహరించిన తీరు మరో సారి చర్చనీయాంశమయింది.