ఆంధ్రప్రదేశ్లో చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలనుకునే పేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
50 చదరపు గజాల లపు చిన్న ప్లాట్లలో G+1 రకంగా ఇళ్లు నిర్మించుకునే వారు ఇకపై కేవలం రూ.1 ఫీజ్ చెల్లించి అనుమతి పొందవచ్చు. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు ఏజెంట్లు, అధికారుల చుట్టూ తిరగకుండా సులభంగా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.
పట్టణాలు, నగరాల్లో 100 గజాలు లోపు భూముల్లో ఇంతకుముందు ప్లాన్ అప్రూవల్ ప్రక్రియలో భారీ ఫీజులు, డాక్యుమెంట్ల గందరగోళం, ఆలస్యాలు ప్రజలను ఇబ్బంది పెట్టేవి. కానీ ఇప్పుడు, 50 గజాల ప్లాట్లకు రోడ్డు వెడల్పు కేవలం 2 మీటర్లు ఉంటే చాలు. ఆన్లైన్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి రూ.1 చెల్లించి అనుమతి పొందవచ్చు. ఇది భవన నిర్మాణ సాంకేతిక మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పులతో రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి 6 కోట్ల రూపాయలకు పైగా ప్రజల భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ పథకం ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మార్పు ఏపీలో హౌసింగ్ సెక్టార్కు బూస్ట్ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు పెరిగాయి. మరిన్ని వివరాలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ (cdma.ap.gov.in)లో చూడవచ్చు.