నటుడు రాహుల్ రామకృష్ణా దసరా పండుగ రోజు పెట్టిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. అటు జాతిపితకి వ్యతిరేకంగా.. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఘోరంగా అవమానించేలా ఉన్న ఆ పోస్టులు ఒక్క సారిగా పెనుప్రకంపనలు సృష్టించాయి. వాటి రియాక్షన్స్ కేవలం కామెంట్స్ రూపంలోనే కాదు.. బయట కూడా కనిపించినట్లుగా ఉన్నాయి.వెంటనే సోషల్ మీడియా హ్యాండిల్స్ ను డియాక్టివేట్ చేసుకున్నారు రాహుల్ రామకృష్ణ.
ట్విట్టర్ తో గేమ్స్ ఆడేవాళ్లలో రాహుల్ రామకృష్ణ ముందు ఉంటారు. గతంలోనూ కొన్ని సందర్భాల్లో వివాదాస్పద ట్వీట్లు పెట్టి.. తన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని చెప్పారు. ఈ సారి అయితే అలా చెప్పి.. ట్వీట్లు డిలీట్ చేయకుండా మొత్తం అకౌంట్ నే డీఏ చేశారు. తెర వెనుక ఏం జరిగిందో ఆయన చెబితేనే తెలుస్తుంది. లేకపోతే ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తే భయపడి డీఏ చేశారని చెప్పుకుంటారు. అది సహజం.
రాహుల్ రామకృష్ణ అలాంటి ట్వీట్లు పెట్టేటప్పుడు.. జనాల నుంచి వచ్చే రియాక్షన్ ను అంచనా వేసి ఉండాల్సింది. ఆయన గుర్తింపు ఉన్న నటుడు.. ఆయనపై ఎటాక్ చేయడానికి పనిలేని ఓ వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మహాత్ముడ్ని కించ పరచడం..వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా ఘోరంగా అవమానించడం అంటే..తర్వాత వచ్చే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉండి ఆ ట్వీట్లు చేసి ఉంటే బెటర్‌గా ఉండేది.
ఇప్పుడు ఆ ట్వీట్ల వల్ల వ్యక్తిగతంగా జరిగే నష్టాన్ని ఆయన పూడ్చుకోలేరు. అలాగే ఇక ముందు ఓ వర్గానికి పూర్తిగా వ్యతిరేకమయ్యారన్న విషయాన్నీ మర్చిపోలేరు.