వైసీపీ నేత అంబటి రాంబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గా ఫెలోషిప్ చేస్తున్న అంబటి కమార్తె శ్రీజ .. అక్కడే తెలుగు అబ్బాయి అని హర్షని ప్రేమించారు. ఆయన అమెరికాలో ఓ బ్యాంకులో పని చేస్తున్నారు. వీసా నిబంధనల కారణంగా వారు ఇండియాకు రాలేకపోతున్నారని అందుకే హిందూ సంప్రదాయంలో అమెరికాలో పెళ్లి చేశామని అంబటి రాంబాబు ఓ వీడియో విడుదల చేశారు.
ఈ పెళ్లికి అబ్బాయి హర్ష తల్లిదండ్రులు రాలేదు. వారికి వీసాలు రాలేదని అందుకే వారు ఆన్ లైన్లో పెళ్లి చూశారని అంబటి తెలిపారు. విచిత్రం ఏమిటంటే తన అల్లుడు గురించి వీడియోలో పరిచయం చేస్తూ.. అన్నీ డిటైల్స్ పక్కన ఉన్న వాళ్లని అడుగుతూ చెప్పారు. అల్లుడి గురించి ఏమీ తెలియనట్లుగా ఆయన చేసిన యాక్టింగ్ చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంత కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం అల్లుడి గురించి కనీస డీటైల్స్ తెలుసుకోరా అన్నది అందరికీ వచ్చే సందేహం.
వారు ఇండియాకు వచ్చినప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని అంబటి రాంబాబు ప్రకటించారు. అంబటి రాంబాబు కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుంది తణుకు చెందిన కమ్మ సామాజికవర్గం అబ్బాయినని చెబుతున్నారు. అంబటి రాంబాబుకు ముగ్గురు కూతుళ్లు. శ్రీజ పెద్ద కూతురని తెలుస్తోంది. మిగతా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. ఓ కూతురు కుటుంబంలో సమస్యలు రావడంతో గత ఎన్నికలు ముందు ఆయన అల్లుడు తీవ్ర ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు.