వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా జోహో కార్పొరేషన్ తీసుకు వచ్చిన మెసెజింగ్ యాప్ కు.. మన దేశంలోనే కుట్రలు చేసే వారు ప్రారంభమయ్యాయి. అది బీజేపీ యాప్ అని.. సమాచారం అంతా బిజేపీకి, సంఘ్‌కు చేరుతుందని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించేశారు. కావాలంటే టెలిగ్రామ్ అియనా వాడుకోండి కానీ జోహో రిలీఫ్ చేసిన అరాట్ఏఐని మాత్రం వాడవద్దని ట్రెండ్ చేస్తున్నారు.
మన దేశం ఉత్పత్తులపై ఎవరో కుట్రలు చేయాల్సిన పని లేదు. మనమే చేసుకుంటామని ఇలాంటి వాళ్లు నిరూపిస్తున్నారు. శ్రీధర్ వెంబు నాయకత్వంలోని జోహో కార్పొరేషన్ .. చెన్నై కేంద్రంగా ఉంది. కానీ ఎప్పుడూ బీజేపీతో ఆయన ఎప్పుడూ అసోసియేట్ కాలేదు. ఉన్న విలువలతో ఆయన కంపెనీని నడుపుతూంటారు . యువతకు మార్గనిర్దేశకత్వం చేస్తూంటారు. బీజేపీని ఎప్పుడూ ఆయన సమర్థించలేదు కూడా.
అయినా కేంద్రం స్వదేశీ నినాదాన్ని తీసుకుందని.. దానికి తగ్గట్లుగా జోహో ప్రారంభించిన యాప్ ను .. ప్రమోట్ చేస్తోందని.. బీజేపీ, సంఘ్ వ్యతిరేకులు ప్రచారం ఫ్రారంభించారు. నిజానికి వారిది కేవలం.. బీజేపీ నేతలు ప్రమోట్ చేస్తున్నారన్న ఈర్ష్య మాత్రమే. మన సమాచారం వాట్సాప్, టెలిగ్రామ్ అయినాతీసుకోవచ్చు కానీ.. ఇండియన్స్ దగ్గర మాత్రం ఉండకూడదని వీరి వాదన. ఇలాంటి వారు ఉంటే స్వదేశీ నినాదం.. ఒక అడుగు ముందుకు.. ఆరు అడుగుల వెనక్కి పోవడంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు.