తెలుగుదేశం పార్టీ నేతలుగా చెలామణి అవుతూ అక్రమ మద్యం తయారు చేస్తున్న నేతలపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతుల కొంత మంది ముఠాగా ఏర్పడి అక్రమ మద్యం తయారు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా చిన్నపాటి యంత్రాలతో పరిశ్రమ కూడా రహస్యంగా ఏర్పాటు చేశారు. పోలీసులు విషయం తెలుసుకుని రెయిడ్ చేసి ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మద్యాన్ని బెల్టు షాపుల్లో అమ్ముతున్నట్లుగా గుర్తించారు.
వైసీపీ హయాంలో ప్రారంభమైన అక్రమ మద్యం తయారీ
నాణ్యమైన మద్యాన్ని తక్కువ వరకే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ తగ్గిపోయింది. అయితే వైసీపీ హయాంలో ఇలా నకిలీ మద్యం తయారు చేయించి అమ్మడం అలవాటు అయిపోయింది. టీడీపీ వచ్చిన తర్వాత కూడా అదే పని కొనసాగించారు. అధికార పార్టీ అనే ట్యాగ్ అడ్డం పెట్టుకుని బెల్టు దుకాణాల్లో అమ్మించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం వెంటే స్పందించింది. పోలీసులు చర్యలు తీసుకున్నారు. అరెస్టులు చేశారు. ఇతర చోట్ల ఎక్కడైనా ఇలాంటి డంపులు ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్నారు.
తప్పుడు పనులు చేస్తే ఏ పార్టీ అయినా వదలరు !
రాష్ట్రం మొత్తం ఇలాంటి అక్రమ మద్యం డెన్లు, సారా డెన్లు ఏమైనా ఉంటే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నిర్వీర్యం చేయనున్నారు. అక్రమాలు చేసే వారికికి టీడీపీ అనే ముద్ర లైసెన్స్ కానే కాదని పోలీసులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలా అక్రమ మద్యం వ్యాపారం వైసీపీ హయాం నుంచీ సాగుతుండటం ఎక్సైజ్ పోలీసులు సూత్రధారుల కోసం తీస్తున్నారు. మద్యం విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. గత ప్రభుత్వం అధికారికంగా జే బ్రాండ్ల పేరుతో నాసిరకం లిక్కర్ అమ్మింది. అలాంటి వాటికి చోటు లేకుండా చేయాలని ప్రయత్నిస్తూంటే.. టీడీపీ నేతలే ఈ అక్రమ మద్యం దందా చేయడం నాయకత్వానికి సమస్యగా మారింది.
ప్రత్యేకంగా రివ్యూ చేసిన చంద్రబాబు
వైసీపీ హయాంలో అయితే.. మద్యం తయారీ, స్మగ్లింగ్ అనేది అధికార పార్టీ నేతలకుపెద్ద ఆదాయవనరుగా ఉండేది. ఇలాంటి వాటిని ఎప్పుడూ పట్టుకునేవారు కాదు. కేసినో ఆడుతూ దొరికితేనే..పోలీసులు అది కేసినో కాదని వాదించారు. అలాంటి పరిస్థితుల పోలీసింగ్ నుంచి ఇపుడు టీడీపీ నేతలు అయినా సరే కఠినంగా చర్యలు తీసుకునే పోలీసింగ్ వచ్చింది. అధికార పార్టీలో ఉండే మరింత బాధ్యతగా ఉండాలన్న సంకేతాలను చంద్రబాబు పంపుతున్నారు. తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని నేరుగా చర్యలతో నిరూపిస్తున్నారు.