రియల్ ఎస్టేట్ లో మనం మోసపోతే.. మోసపోయామని తెలిసి కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పించుకోలేం. అంటే మన భవిష్యత్ సంపాదనను కూడా మోసగాళ్లు లూటీ చేస్తారు. ఈఎంఐ , బైబ్యాక్ ప్లాట్ ఆఫర్లు అలాంటివే .
రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈఎంఐ , బైబ్యాక్ ఆఫర్లతో ప్లాట్ల అమ్మకాలు ఇటీవల పెరిగాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ప్లాట్లను విక్రయించడానికి “సులభమైన ఈఎంఐ పథకాలు” , “హామీ బైబ్యాక్ ధరలు” వంటి ఆఫర్లను ప్రచారం చేస్తున్నాయి. ఈ పథకాలు మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నవారికి, ఆస్తి కొనుగోలు సులభమని భావించేలా చేస్తాయి. ఎందుకంటే ఇవి ఏ మాత్రం అనుకూలం కాలని ప్లేస్ లో వెంచర్లు వేస్తాయి. అవి అమ్ముడుపోవడానికి ఇలాంటి ఆఫర్లు ఇస్తారు.
రీ సేల్ లో ఎవరు కొంటారని వచ్చే ప్రశ్నలకు.. బైబ్యాక్ ఆఫర్లలో సంస్థలు భవిష్యత్తులో ప్లాట్‌ను తిరిగి కొనుగోలు చేస్తామని, అధిక రాబడిని ఇస్తామని వాగ్దానం చేస్తారు. అయితే, ఈ హామీలకు చట్టపరమైన ఆధారం లేదు. ఒకవేళ సంస్థ ఆర్థిక సమస్యల్లో పడితే లేదా మూతపడితే, పెట్టుబడిదారులు తమ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని సంస్థలు పెట్టుబడిదారులు ఈఎంఐ చెల్లింపులు చేసిన తర్వాత, సంస్థ అదృశ్యమవడం వంటివి జరుగుతాయి.
ఈ పథకాల్లో అమ్మే ప్లాట్లరు చట్టపరమైన సమస్యలు ఉండొచ్చు. వ్యవసాయ భూములు, అనధికార లేఅవుట్లు లేదా వివాదాస్పద ఆస్తులు కావచ్చు. ఈఎంఐ లేదా బైబ్యాక్ ఆఫర్లకు ఆకర్షితం కాకుండా, ఆస్తిని నేరుగా పూర్తి చెల్లింపుతో కొనుగోలు చేయడం లేదా బ్యాంక్ లోన్ తీసుకోవడం మంచిది. బ్యాంక్ లోన్ తీసుకోవడం వల్ల ఆస్తి చట్టపరమైన ధృవీకరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.