ఏపీ మంత్రి నారా లోకేష్ ..దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కార్పొరేట్ ప్రముఖులతో ఏపీలో ఇన్వెస్ట్ మెంట్స్ పై చర్చలు జరిపారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో సమావేశమైన లోకేష్.. టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. అలాగే ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఈవీల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రూఫ్‌టాప్ సోలార్ అభివృద్ధిలో కలిసి పనిచేయాలని కోరారు.టాటా గ్రూపు చేపట్టనున్న పారిశ్రామిక విస్తరణలకు ఏపీలో ఉన్న అవకాశాల గురించి వివరించారు.
అంతకు ముందే ఈఎస్ఆర్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా హెడ్ తోనూ వారి కార్యాలయంలో నారా లోకేష్ సమావేశమయ్యారు. విశాఖ, కాకినాడ పోర్టుల వద్ద
లాజిస్టిక్స్ హబ్‌లో భాగం అవ్వాలని .. ఏపీఐఐసీతో కలిసి పని చేయాలని కోరారు. రొయ్యల పరిశ్రమకు అవసరమైన కోల్డ్ చైన్ ఇన్ ఫ్రా గురించి చర్చించారు. అంతకు ముందు లాజిస్టిక్స్ గ్లోబల్ లీడర్ గా ఉన్న ట్రాఫిగురా కంపెనీ సీఈవో సచిన్ గుప్తాతోనూ సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు.
ఏపీని మార్కెట్ చేసేందుకు పెట్టుబడిదారుల స్వర్గధామంగా మార్చేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి మంచి ప్రోత్సాహకాలు ఇస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ లో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించబోతున్నారు. దానికి హాజరై.. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించాలని లోకేష్ ఆహ్వానిస్తున్నారు.