హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త శిఖరాలకు చేరుకుంది. ఇప్పటి వరకూ వంద కోట్ల వరకూ ఎకరం ధర పలికిన రేట్లు ఇప్పుడు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. హైదరాబాద్ రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం వేలిన భూమికి ఎకరానికి రూ.177 కోట్లు చొప్పున కొనేందుకు ఎంఎస్ఎస్ రియాల్టీ సంస్థ బిడ్డింగ్ వేసి విజయం సాధించింది. సోమవారం జరిగిన వేలంలో ఆ స్థలం కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. కానీ ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ భారీగా వెచ్చించింది.
మొత్తం 7.67 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాల్టీ వేలం పాటలో కొనుగోలు చేసింది. ఎకరానికిరూ. 177కోట్ల చెప్పున మొత్తం రూ.1,357 కోట్లు చెల్లించనుంది. ఈ స్థలం హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన స్థలంగా మారడానికి కారణాలుఉన్నాయి. కార్పొరేట్ ఆఫీసుల మధ్య.. ఐటీ కంపెనీల మధ్య ఈ స్థలం ఉంది. విశాలమైన స్థలం కావడంతో ఆకాశహర్మ్యం నిర్మించవచ్చు. జీసీసీలకు ఇప్పుడు హైదరాబాద్ హాట్ ఫేవరేట్ అవుతోంది. అలాంటి కార్యాలయాలను నిర్మిస్తే భారీ లాభాలు వస్తాయని ఎంఎస్ఎన్ రియార్టీ నమ్మింది.
ఎంఎస్ఎన్ రియాలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. ఫార్మా సంస్థగా భారీ విజయం సాధించిన ఈ సంస్థ గతంలో కూడా నియోపోలిస్ ప్రాంతంలో పెద్ద భూములు కొనుగోలు చేసి, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తోంది. రియల్ ఎస్టేట్ పడిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఈ వేలం చెక్ పెట్టినట్లయింది.