వైసీపీలో ఇంచార్జులుగా డబ్బులు ఖర్చు పెట్టుకునేవారిని తెచ్చి జగన్ రెడ్డి నియమిస్తున్నారు . అద్దంకికి కొత్త ఇంచార్జ్ గా పిడుగురాళ్ల నుంచి ఓ డాక్టర్ ను నియమించారు. ఆయన అక్కడకు వెళ్లి నేను గెలిచాక వారం రోజులు నియోజకవర్గంలో ఉండను.. మీరు ఎవర్ని కావాలంటే వారిని చంపుకోండి అన్నట్లుగా డైలాగులు కొట్టారు. నువ్ గెలుస్తావో లేదో కానీ.. మళ్లీ ఎన్నికలకే ఇంకా నాలుగేళ్ల టైం ఉంది.. ఈ లోపున వారం టీడీపీ వాళ్లు ఆ చాయిస్ తీసుకుంటే మీ పరిస్థితి ఎంటయ్యా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆయనకే వస్తున్నాయి. దానికి ఆయన వద్ద సమాధానం ఉండదు.
డబ్బున్న వాళ్లను ఎంపిక చేసుకుని జగన్ రెడ్డి ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంచార్జ్ గా పెట్టిన వారందరికీ టిక్కెట్లు ఇస్తామన్న గ్యారంటీ లేదు. చివరి క్షణంలో అలా ఎంత మందిని జగన్ రెడ్డి శంకరగిరి మాన్యాలకు పట్టించారో ఆ పార్టీలో అందరికీ తెలుసు. అద్దంకిలో ప్రస్తుతానికి జగన్ రెడ్డి ఓ లీడర్ ను మాత్రం పెట్టుకున్నారు కానీ.. అక్కడ గొట్టిపాటిని ఢీకొట్టడానికి చివరిలో ఎవరో ఒకర్ని తీసుకు వస్తారు. అది కూడా రెడ్డి వర్గానికి చెందిన నేననే. ఆ విషయం కొత్త ఇంచార్జ్ కు తప్ప .. అందరికీ తెలుసు. అయినా ఆయన మిడిసిపడుతున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఒక్క అద్దంకి ఇంచార్జ్ కాదు.. కొంత మంది కొత్తగా చాన్స్ వచ్చిందని ఇలా రెచ్చిపోతున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించి ..వారు ఇతర పార్టీల్లో కూడా చేరకుండా.. వారిని శత్రువులుగా మార్చి మరీ రోడ్డున పడేస్తాడు జగన్ రెడ్డి. ఈ విషయం వారికి ఇంకా అర్థం కావడం లేదు. బలైపోయినా వాళ్లను చూసి అయినా ఇలాంటి వాళ్లు డిక్కీ కలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా రాజకీయాలు చేయకుండా.. సంప్రదాయంగా రాజకీయం చేస్తే.. కనీసం లీడర్ గా అయినా ప్రజలు గుర్తిస్తారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.