RRR అంటే రాజమౌళి తీసిన గురించి కాదు.. ఇది కన్నడ త్రయం గురించి. కన్నడ సినిమా రంగంలోని రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి. శెట్టి.. ఈ ముగ్గురు శెట్టి త్రయం చూట్టే ఇప్పుడు కన్నడ సినిమా తిరుగుతోంది. వీరి కలయికలో రూపొందిన ‘గరుడ గమన వృషభ వాహన’ (రక్షిత్ సమర్పణలో, రాజ్, రిషబ్ నటనలో), ‘కాంతార’ (ఇందులో రాజ్ సంభాషణలు రాసి ఒక సన్నివేశాన్ని కొరియోగ్రాఫ్ చేశారు) వంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఈ ముగ్గురుది విలక్షణమైన దారి. ముగ్గురిలో ఉండే కామన్ క్యాలిటీ కల్చర్ కి పెద్ద పీట వేయడం. వీరు ఎంచుకునే కథలు కన్నడ రూట్స్ కి దగ్గర ఉంటూనే పాన్ ఇండియాని ఆకర్షిస్తున్నాయి.
రిషబ్ శెట్టి కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడు, నటుడు, నిర్మాతగా నిలబడ్డారు. “కాంతార”తో విప్లవాత్మక విజయాన్ని సాధించాడు. ఆయన సినిమాలు కేవలం వినోదమే కాక, సాంస్కృతిక చిహ్నాలు కనిపిస్తాయి. రక్షిత్ శెట్టి నటుడు, దర్శకుడు, నిర్మాత. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. ఇంటర్టైన్మెంట్, ఆర్ట్ మిక్స్ చేయడం ఆయన స్టైల్. రాజ్ బి. శెట్టి నటుడు, దర్శకుడు, రచయిత, కొరియోగ్రాఫర్. కన్నడ సాంస్కృతిక నేపథ్యాలతో సినిమాలు చేయడం ఆయన స్టైల్. ఇటీవల సు ఫ్రమ్ సో సినిమాతో మంచి హిట్టు కొట్టారు. ఈ త్రయం ఇప్పుడు కన్నడ చిత్ర సీమకు కొత్త ఊపిరిని అందిస్తోంది.