కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 16వ తేదీన ఆయన కర్నూలు పర్యటనకు వస్తున్నారు. అప్పుడే డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఇది దేశంలోని మొదటి ‘డ్రోన్ సిటీ’. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు, ఇది డ్రోన్ తయారీ, పరీక్షణ, పరిశోధన, ఇన్నోవేషన్‌కు అత్యాధునిక కేంద్రంగా మారనుంది.
ప్రధాని మోదీ శ్రీశైలం దర్శనం తర్వాత కుర్నూలు ప్రాంతానికి చేరుకుని డ్రోన్ సిటీ పునాది రాయి వేస్తారు. ఈ సందర్భంగా జై రాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ప్రారంభం ,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. భూసేకరణ , మాస్టర్ ప్లాన్ పూర్తి కావడంతో, ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. డ్రోన్ ఆపరేటర్లకు అధునాతన శిక్షణ కేంద్రం, రిమోట్ పైలట్ సర్టిఫికేషన్లు , : డ్రోన్ టెక్నాలజీలో పరిశోధన, డెవలప్మెంట్ కోసం గ్లోబల్ స్థాయి కేంద్రం , స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లకు మద్దతు, 100కి పైగా డ్రోన్ యూజ్ కేస్లు, డ్రోన్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, టెస్టింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే మాన్యుఫాక్చరింగ్ జోన్లు, టెస్టింగ్ ఫెసిలిటీలు, ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ‘ఆంధ్రప్రదేశ్ డ్రోన్ మార్ట్’ పోర్టల్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు, క్లయింట్లను కనెక్ట్ చేసే ప్రణాళికలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ను ‘డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా మార్చాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, మైనింగ్, మున్సిపల్ సర్వీసెస్ వంటి రంగాల్లో డ్రోన్ సేవలను విస్తరించడం, పెట్టుబడులు ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం వంటివి ఈ డ్రోన్ సిటీతో సాకారం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు.