వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారన్న ప్రచారంతో ఓ రోజు స్కిట్ చేస్తున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని పరామర్శించి.. పరిశీలించి అక్కడి నుంచి ఆయన తాను కట్టేసిన కాలేజీని రాష్ట్రానికి చూపించబోతున్నారు. అదే సమయంలో ఆయన విశాఖలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ కూడా హైలెట్ అవుతోంది. ఎందుకంటే జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చూపించబోయే మెడికల్ కాలేజీ మొండిగోడలతో ఉంది..కానీ రుషికొండ ప్యాలెస్ మాత్రం రెడీ అయిపోయింది. జగన్ రెడ్డి వికృత మనస్థత్వానికి ఇదే సాక్ష్యంగా ఉండనుంది.
మొండిగోడలతోనే ఉన్న మాకవరం పాలెం మెడికల్ కాలేజీ
మాకవరంపాలెం మెడికల్ కాలేజీకి 2021 మే 31న సీఎం హోదాలో జగన్ వర్చువల్ మోడ్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుకుని శంకుస్థాపన చేశారు. జగన్ రెడ్డి దిగిపోయే వరకూ అంటే 2024 మార్చి వరకూ మూడేళ్ల కాలం చేసిన పనులు కొన్ని బ్లాకులకు మూడు ఫ్లోర్ల వరకూ శ్లాబ్ వేయడం, మిగతా బ్లాకులకు పునాదులతో ఆపేయడం. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఇలా ఇది ఒక్కటే కాదు.. ఇంకా పధ్నాలుగు కాలేజీలు అలాగే ఉండిపోయాయి. వాటి నిర్మాణం, నిర్వహణకు ఐదు వేల కోట్లు అవసరం అవుతాయి. అందుకే ప్రభుత్వం పీపీపీ మోడ్లో నిర్మించి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.
అన్నీ అంతే.. ప్రజలకు చూపించనున్న జగన్
జగన్ రెడ్డి తాను మెడికల్ కాలేజీలు కట్టేశానని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ తన పదేళ్ల పాలనలో ఆయన కట్టింది రుషికొండ ప్యాలెస్ మాత్రమే. వందల కోట్లు విలువైన టూరిజం భవనాలను ధ్వంసం చేసి.. తన కోసం ..తన కుటుంబం కోసం ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక్క భవనం కోసం రూ. ఐదు వందల కోట్లను వెచ్చించారు. అదే మొత్తంలో ఇప్పుడు తను చూపించబోయే మెడికల్ కాలేజీకి కేటాయించినట్లయితే భవనాలు పూర్తి అయ్యేవి.కానీ జగన్ రెడ్డి ఆ పని చేయలేదు.
కట్టడం చేతకాలేదు కానీ.. కట్టేశానని ఎలా చెప్పుకుంటారు?
తొలి సారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు భూసమీకరణకు.. కోర్టు కేసులు పరిష్కరానికి మూడేళ్ల సమయం పట్టిన తర్వాత రెండేళ్లలో అమరావతిలో పనుల్ని చాలా వేగంగా చేయించారు. కానీ ఐదేళ్లలో రాజధాని కట్టలేదని చెప్పి జగన్ రెడ్డి చేసిన అరాచకం అందరూ చేశారు. కానీ జగన్ రెడ్డి ఐదేళ్లలో తాను శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల భవనాలను సగం కూడా నిర్మించలేదు. ఎందుకంటే…ఐదేళ్లలో పూర్తవుతాయా అని ఎదురు ప్రశ్న వేస్తారు. జగన్ రెడ్డి నిర్వాకాలపై .. ఇంకా ప్రజలు అసహ్యించుకుంటున్నా..ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు.