ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి దోచావే సాంగ్ రిలీజ్ అయింది.
“రాయంచతో రాసలీల నడిరేయివేళ” అంటూ సాగే ఈ పాటను మనసుని హత్తుకునే మెలోడీగా కంపోజ్ చేశాడు లియాన్ జేమ్స్. వినగానే ఆకట్టుకునే ట్యూన్ ఇది. శ్రీమణి రాసిన లిరిక్స్‌లో మంచి ఫీల్ ఉంది. అభి పాడిన తీరు మరింత మెలోడీని జత చేసింది. ప్రియదర్శి, ఆనంది జోడీ కూడా కొత్తగా ఉంది.
ప్రియదర్శి నటిస్తున్న మిత్రమండలి దీపావళికి రిలీజ్ అవుతుంది. అయితే అది బడ్డీ కామెడీ. ప్రియదర్శికి సోలో హిట్ కావాలి. గతంలో వచ్చిన డార్లింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేమంటే హిట్ కొడితే హీరోగా తన కెరీర్‌కి మరింత జోష్ దొరుకుతుంది.