ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాడు .. ముఖ్యమంత్రిగా 15ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ 1న తొలి సారి సీఎం పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఆయన మూడు సార్లు ఓడిపోయారు. మూడు సార్లు గెలిచారు. పదిహేనేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్నారు. మిగతా కాలం అంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దక్షిణాదిలో ఏపీ వంటి రాష్ట్రాల్లో ఓ రాజకీయ నేత ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల పాటు పని చేయడం అంటే అసాధారణం. దక్షిణాదిలో కరుణానిధి, పుదుచ్చేరి రంగస్వామి తర్వాత చంద్రబాబునాయుడే. ఈ పదవి కాలం ముగిసే సరికి వారినీ అధిగమిస్తారు.
కులమతాలు, ప్రాంతాల రాజకీయంలో కొట్టుమిట్టాడే ఏపీలో చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యారంటే.. దానికి కారణం ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, చేస్తున్న పని పట్ల పవిత్రత ఉండటమే. ప్రజల కోసమే రాజకీయం చేయడం అనే దాన్ని ఆయన మనసా వాచా నమ్ముకున్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తే.. ప్రజల్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రజలే తన వెంట ఉంటారని నమ్ముతారు. అభివృద్ధికి ఓట్లు వేయరు అని ఎంత ఎంత మంది ఎన్ని విశ్లేషణాలు చేసినా ఆయన మాత్రం తగ్గరు. నిజానికి చంద్రబాబు ఇమేజ్ అభివృద్ధి.. ఆయన పడే కష్టం.. బాగు చేసే విధానం చూసే అందరూ ఫ్యాన్స్ అవుతారు . అదే ఇమేజ్ ఆయనను ఇంత కాలం రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలబెట్టింది.
దేశంలో చాలా మంది సుదీర్ఘ కాలం పదవుల్లో కొనసాగిన నేతలకు ఓ బలమైన భావోద్వేగం అండగా ఉంటుంది. కులం , మతం లేదా ప్రాంతం ఇలాంటి భావోద్వేగాలకు నాయకత్వం వహించి నేతుల ఎక్కువకాలం పదవుల్లో ఉన్నారు. కానీ చంద్రబాబు వారందటికి భిన్నం. ఆయన అభివృద్ధి రాజకీయాలు చేస్తారు. ఆ ఇమేజ్ తోనే కొనసాగుతున్నారు. ఇదే అంశం చంద్రబాబును దేశ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆయన ముఖ్యమంత్రిగా తన జర్నీని ప్రారంభించినప్పుడు ఎంత డెడికేటెడ్‌గా ఉన్నారో… నాలుగోసారి సీఎం అయిన తర్వాత కూడా అంతే ఉన్నారు.
రాజకీయాల్లో తగిలే ఎదురుదెబ్బలను తట్టుకోవడం చిన్న విషయం కాదు. కానీ అన్నీ పార్ట్ ఆఫ్ జర్నీ అనుకుని తట్టుకుని నిలబడుతూ ముందుకు సాగితేనే విజయాలు లభిస్తాయి. ఆ విషయంలో చంద్రబాబు అందరికీ స్ఫూర్తి.