చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ ను నిన్న హైకోర్టు కొట్టేయగానే ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనను నాలుగు వారాల పాటు అరెస్టు చేయవద్దని ఆదేశించి కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశించింది. తండ్రితో కలిసి లిక్కర్ లంచాల డబ్బుల్ని రవాణా చేసి ఎన్నికల ఖర్చులకు చేరవేయడం, బినామీ కంపెనీల ద్వారా వైట్ గా మార్చడం వంటి పనులను మోహిత్ రెడ్డి చేశారు.
మోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన తర్వాత పరారయ్యారు. న్యాయపోరాటం చేస్తున్నారు. ఎక్కడా ఆయనకు ఊరట లభించలేదు. ఆయన తండ్రి పారిపోతూంటే బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. అప్పట్నుంచి ఆయన చేయని రచ్చ లేదు. బయటకు వచ్చినప్పుడల్లా అరుపులు, కేకలు, శాపనార్థాలతో రెచ్చిపోతున్నారు. ఆయనకు తోడుగా ఆయన కుమారుడు కూడా చేరుతాడని అనుకుంటున్న సమయంలో .. న్యాయపోరాటం చేస్తూ తన అరెస్టును వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
ఆయన వాహనాల్లోనే డబ్బులు తరలించారు. తన వాహనాల్లో తరలిస్తే తాను ఎందుకు బాధ్యుడినవుతానని ఆయన అంటున్నారు. లిక్కర్ స్కామ్లో అయినా మోర కేసులో అయినా.. అరెస్టు చేయడానికి ముందు అన్ని న్యాయపరమైన అవకాశాలను కల్పిస్తున్నారు. సుప్రీంకోర్టును వారికి ఊరట లభించకపోతే అప్పుడు అరెస్టు చేస్తున్నారు.