రామ్ చరణ్, ఉపాసనతో పాటు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్దలతో కలసి ప్రధాని మోదీని కలిశారు.అనిల్ కామినేని ఆర్చరీ అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ లో భారత టీం విజయం సాధించింది. ఆర్చరీ వారసత్వాన్ని కాపాడటానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి మా చిన్న అడుగు అని రామ్ చరణ్ ప్రధాని మోదీకి తెలిపారు. అనిల్ కామినేని ఆధ్వర్యంలో 2025లో ప్రారంభమైన ఈ లీగ్, భారతదేశ ఆర్చరీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే మైలురాయిగా మారింది.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనిల్ కామినేని డైరెక్టర్‌గా 2025లో ప్రారంభమైన APL, భారతదేశ మొదటి ఫ్రాంచైజీ ఆధారిత ఆర్చరీ టోర్నమెంట్. దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 12 వరకు న్యూ ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మొదటి సీజన్ ముగిసింది. ఈ లీగ్‌లో 6 ఫ్రాంచైజీలు – పాల్గొన్నాయి. ప్రతి టీమ్‌లో 8 మంది ఆర్చర్లు ఉన్నారు. మొత్తం 36 మంది భారతీయులు , 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతిలో ఆర్చరీ వారసత్వాన్ని పునరుద్ధరించి, ప్రపంచ స్థాయి ట్రైనింగ్, పోటీలు, అంతర్జాతీయ ఎక్స్పోజర్ అందిస్తామని అనిల్ కామినేని ప్రధానికి తెలిపారు. లీగ్ ద్వారా భారతీయ ఆర్చర్లు ఓలింపిక్ 2028కు సిద్ధమవుతారని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. భారతీయ క్రీడల్లో ఆర్చరీ వంటి సాంప్రదాయ క్రీడలు ప్రపంచ స్థాయికి చేరాలని మోదీ ఆకాంక్షించారు.