పాజిటివ్ గా తీసుకుంటే ఏదైనా పాజిటివ్ గా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ పాలనలో మాత్రం సాధ్యం అవుతుంది. ఏపీకి పెట్టుబడులు తీసుకు వచ్చే విషయంలో నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్నో కోణాలు ఉంటాయి. అందులో ఒకటి పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నించడం.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్లతో శ్రీసిటీలో ప్లాంట్ పెట్టాలని డిసైడ్ అయింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ లోపు ఎల్జీ ఇండియా ఐపీవోకు వచ్చింది. ఆ సంస్థపై మదుపర్లకు ఎంత నమ్మకం ఉందంటే .. రూ.11 , 600 కోట్ల సేకరణకు ఇష్యూ జారీ చేస్తే.. మదుపర్లు నాలుగురున్నర లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ ఘనతను నారా లోకేష్..రాష్ట్రానికి పాజిటివ్ గా తీసుకునే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. మార్కెట్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించిందని.. వారి IPO అన్ని రికార్డులను బద్దలు కొట్టిందన్నారు. ప్రపంచ దిగ్గజాలు AP ని తయారీరంగానికి భవిష్యత్తుగా మార్చజానికి మిమ్మల్ని ఏమీ ఆపడంలేదని పిలుపు నిచ్చారు. తలుపులు తెరిచి ఉన్నాయి. ఇదే మంచి సమయం అని .. ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఈ పాజిటివ్ ఎనర్జీని రాజకీయ నేతల్లో చూడటం అసాధారణం అని రాజకీయవర్గాలు భావిస్తూ ఉంటాయి.